విద్యార్థులకు ఉచిత స్మార్ట్ ఫోన్ : పంజాబ్ ప్రభుత్వం

పంజాబ్ ప్రభుత్వం విద్యార్థులు తీపి కబురు అందించింది.కరోనా కారణంగా పాఠశాలలు, కళాశాలు మూసివేయడంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు నష్టపోతున్నారు.

 Punjab, Governament, Students , Cm, Amarender Singh, Governament Schools, Online-TeluguStop.com

విద్యార్థులకు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లును అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా నేపథ్యంలో విద్యార్థుల చదువులు ముందుకు సాగడం లేదు.

కొన్ని ప్రైవేట్ కళాశాలు, కార్పొరేట్ సంస్థలు విద్యార్థులకు ఆన్ లైన్ లో తరగతులు చెబుతున్నారు.ప్రభుత్వ పాఠశాలలో ఆన్ లైన్ తరగతుల నిర్వహణ లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని, ఆన్ లైన్ లో క్లాసులు ప్రారంభించినా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే స్థోమత పేద కుటుంబాలకు ఉండదు.

ఈ నేపథ్యంలో విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.దశలవారీగా స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తామని, మొదటి దశలో 1.75 లక్షల ఫోన్లు అందించనున్నట్లు ఆయన తెలిపారు.విద్యార్థులకు ఈ స్మార్ట్ ఫోన్లను ఆగస్టు 12న (రేపు) యువత దినోత్సవం సందర్భంగా పంపిణీ చేస్తామని సీఎం తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube