లాక్ డౌన్ లో ఇంటికి  వెళ్లాలనే ప్రజలకు పోలీసులు బ్రేక్….   

E pass, Andhra pradesh Police, Smart People, Check post, E pass Manditory - Telugu Andhra Pradesh Police, Check Post, E Pass, E Pass Manditory, Smart People

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఉద్యోగాలు, పనులు, ఇతర కారణాల వల్ల ఇతరప్రాంతాలకి వెళ్లి నిలిచిపోయిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.దీంతో తాజాగా లాక్ డౌన్ లో సడలింపులు చేపట్టడంతో వలస కార్మికులు, ఉద్యోగస్తులు, తమ ఇళ్లకు చేరుకునేందుకు ప్రైవేటు వాహనాల ద్వారా పయనమవుతున్నారు.

 Smart People Check Post E Pass Andhra Pradesh

ఈ క్రమంలో  ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రజలకి ఈ పాస్ అనుమతులు కచ్చితంగా ఉండాలని ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో కొందరు ప్రజలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఈ పాస్ అనుమతులు లేకుండా రాష్ట్రంలోకి ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తుండగా చెక్ పోస్టుల వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

లాక్ డౌన్ లో ఇంటికి  వెళ్లాలనే ప్రజలకు పోలీసులు బ్రేక్…. -General-Telugu-Telugu Tollywood Photo Image

మరికొందరైతే ఏకంగా చెక్ పోస్ట్ దరిదాపుల వరకు కార్లలో ప్రయాణిస్తూ చెక్ పోస్ట్  వద్దకు రాగానే దిగి నడుచుకుంటూ చెక్ పోస్ట్ దాటే ప్రయత్నం చేశారు.అలాంటి వారిని కూడా పోలీసులు గుర్తించి అటు నుంచి అటే వెనక్కి పంపించేశారు.

అంతేకాక రాష్ట్రంలోకి రావాలంటే కచ్చితంగా ఈ పాస్ కలిగి ఉండాలని లేకపోతే అనుమతించేది లేదని  మరోమారు ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.అంతేగాక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న టువంటి  కరోనా వైరస్ కేసులను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నామని కాబట్టి ప్రజలు ప్రభుత్వ అధికారులకు సహకరించాలని కోరుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయినటువంటి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణాంకాలను పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల పైచిలుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 198 మంది మృత్యు వాత పడ్డారు.అయితే ఇప్పటి వరకు అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రాష్ట్రంలోనే విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా అయినటువంటి అనంతపురం రాష్ట్రంలో నమోదయ్యాయి.

దీంతో ప్రభుత్వ అధికారులు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.

#Smart People #E Pass #Check Post

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Smart People Check Post E Pass Andhra Pradesh Related Telugu News,Photos/Pics,Images..