కుక్కలు చాలా తెలివైనవి.అలాగే వీటికి ఎమోషన్స్ చాలా అధికంగా ఉంటాయి.
యజమానులను, తమ పిల్లలను కాపాడుకోవడం కోసం ఇవి ఎంతకైనా తెగిస్తాయి.ఆపదలో ఉన్న తమ పిల్లలను సంరక్షించేందుకు అవి తెలివిగా ఆలోచించి వాటిని బయట పడేస్తాయి.
కాగా బోర్డర్ కూలీస్ అన్ని పెంపుడు కుక్కలలో అత్యంత తెలివైనవిగా పేరు తెచ్చుకున్నాయి.బోర్డర్ కూలీ కుక్కలు సూపర్ టాలెంటెడ్ అని చెప్పొచ్చు.
కష్టపడి పనిచేసే కుక్కలలో ఇవి ముందు వరుసలో ఉంటాయి.ఈ శునకాలు తన తెలివితేటలతో యజమానులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి.
ఇవి పెద్ద సంఖ్యలో పదాలు, ఆదేశాలను నేర్చుకోగలుగుతాయి.రోజూ పనిలో పెట్టినప్పుడు ఇవి చాలా సంతోషంగా ఉంటాయి.
చాలా సినిమాల్లో కూడా ఇవి అద్భుతంగా నటించి గొప్ప పేరు తెచ్చుకున్నాయి.
కాగా తాజాగా ఈ కుక్కల తెలివిని మరోసారి నిరూపించే వీడియో ఒకటి వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఒక కుక్క తన పిల్లను కాపాడేందుకు ఒక మనిషి లాగా ఆలోచించింది.అలా అది తన కుక్క పిల్లను కాపాడుకోగలిగింది.ఈ వైరల్ వీడియోలో ఒక తల్లి కుక్క పైన ఉండగా దాని పిల్ల కుక్క ఒక కాలవలో పడిపోయింది.అయితే దానిని ఎలా బయటికి తియ్యాలో కాసేపటి దాకా తల్లి కుక్క ఆలోచించింది.
అనంతరం తన పిల్ల కుక్క మెడలో ఉన్న తాడుని నోటకరచుకొని బయటికి దూకింది.ఆపై ఆ తాడుని గట్టిగా లాగుతూ కుక్క పిల్లను బయటికి తీసుకు వచ్చింది.ఆ తర్వాత అవి రెండూ సంతోషంగా అక్కడినుంచి వెళ్ళిపోయాయి.దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్ గా మారింది.ఆ క్లిప్‌కి ఇప్పటికే 60 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసిన నెటిజన్లు ఇది చాలా స్మార్ట్ డాగ్ అని పొగుడుతున్నారు.
ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.