మేక ఆకలి తీర్చడానికి సాయం చేసిన గేదె

మానవత్వం అంటే అందరూ ఎక్కువగా మనుషుల గురించి చెబుతూ ఉంటారు.అయితే మనుషుల కంటే జంతువులలోనే ఎక్కువ మానవత్వం ఉంటుందని అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు రుజువు చేస్తూ ఉంటాయి.

 Smart Goat Finds Amusing Way, Eat The Leaves Of Tree, Animals, Humanity-TeluguStop.com

ఒకే జాతి జంతువులు కాకున్న సాయం అందించడంలో తమ గొప్ప మనసు చూపించుకుంటాయి.ఎక్కువగా సాదు జంతువులలో ఈ రకమైన దయాగుణం ఉంటుంది.

ఆకలితో ఉన్న జంతువులు వేరొక జాతివైనా కూడా తమ దొడ్డ మనసు చాతుకుంటాయి.అలాంటి సంఘటనకి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాగా ఆక‌లిగా ఉన్న మేక‌కు చెట్టు మీదున్న ఆకులు క‌నిపించాయి కాని అందుకునేంత ఎత్తు లేక‌పోవ‌డంతో నిరాశ‌కు గురైంది.ఆకలితో అరిచినా ప‌ట్టించుకునేందుకు అక్క‌డ య‌జ‌మాని కూడా లేడు.

త‌న బాధ‌నంతా ఎదురుగా ఉన్న గేదెతో చెప్పుకున్న‌ది.మేక జంప్ చేసి గేదె మీద‌కి ఎక్కింది.

ఇప్పుడు ఎత్తు కూడా పెర‌గ‌డంతో ఆకులు అందుకునేందుకు సులువుగా మారింది.గేదెను నిచ్చెన‌గా మార్చుకున్న మేక ఆకులు తిని క‌డుపు నింపుకున్న‌‌ది.

మేకకి సాయం చేయడాన్ని సంతోషంగా స్వీకరించినట్లు గేదె కూడా అంగీక‌రించిన్న‌ట్లుగా వీడియోలో చూస్తే అర్థ‌మ‌వుతుంది.ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి సుధా రామెన్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube