చిన్న సైజ్ అంబానీయా?.. ఆస్తులపై నోరు విప్పిన వినోద్ కుమార్

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం ద్వారా ప్రతి సోమవారం ఆలీ ఎంతో మంది సీనియర్ హీరో హీరోయిన్లను వేదికపైకి తీసుకువచ్చి వారి గురించి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతూ వారి నుంచి ఎంతో విలువైన సమాధానాలను రాబడుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంటారు.

 Small Size Ambania Do You Know About Vinod Kumar Assets Value, Vinod Kumar, Toll-TeluguStop.com

ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా నటుడు వినోద్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆలీ నటుడు వినోద్ కుమార్ తో కలిసి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది.

ఇక వినోద్ కుమార్ దాసరి నారాయణ రావు గారితో కలిసి మామగారు సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

అలాగే ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం వెండితెరకు దూరమయ్యారు.ఇలా ఎన్నో అద్భుతమైన తెలుగు సినిమాలలో నటించిన వినోద్ కుమార్ తన సినిమా విశేషాల గురించి ఆలీతో ముచ్చటించారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మీది లవ్ మ్యారేజ్ ఆ అరేంజ్డ్ మ్యారేజ్ ఆ అంటూ ఆలీ వినోద్ కుమార్ ను ఆట పట్టించారు.అయితే తను ఎంతో మందిని లవ్ చేశానని కానీ తనను ఎవరు లవ్ చేయలేదని, చివరికి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నానని సరదాగా సమాధానం చెప్పారు.

ఇక ఎన్నో తెలుగు తమిళ సినిమాలలో నటించిన వినోద్ కుమార్ ఆస్తిపాస్తులను కూడా బాగా సంపాదించినట్లు ఆలీ ప్రశ్నించారు.మీరు బాగా ఆస్తులను సంపాదించారట కదా చిన్నసైజు అంబానీ అంట కదా అంటూ ప్రశ్నించారు.

ఇక ఈ ప్రశ్నకు వినోద్ సమాధానం చెబుతూ మినీ సైజ్ అంబానీ అయితే నేను ఇక్కడ ఉండను ఏ లండన్ లో ఉండేవాడిని డబ్బు అయితే సంపాదించాను కానీ నాకు సరిపడే అంత సంపాదించానని మీలాగా సంపాదించానని వినోద్ కుమార్ ఆలీతో తన ఆస్తిపాస్తుల గురించి కూడా మాట్లాడారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తనతో పనిచేసిన దర్శక నిర్మాతలు సహ నటీనటుల గురించి కూడా వినోద్ ముచ్చటించారు.అలాగే ఇతర పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఈ కార్యక్రమంలో ఈయన కాస్త ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు వినోద్ ఎలాంటి విషయాలను ముచ్చటించారనే విషయం తెలియాలంటే ఈ కార్యక్రమం ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.ప్రస్తుతం ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube