వెండి తెరకే కాకుండా బుల్లి తెరకు మొదలైన కష్టాలు

లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూత పడ్డాయి.సినిమా షూటింగ్స్‌ లేకపోవడంతో తీవ్రమైన అవస్థలు పడుతున్న సినీ కార్మికులు కనీసం తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు.24 క్రాప్ట్స్‌ వారు కూడా ప్రస్తుతం ఆకలితో అలమటిస్తున్నారు.ఈ సమయంలో చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ ఏర్పాటు చేయడం జరిగింది.

 Corona Virus, Lock Down, Theatres, Movie Shootings, Jabardasth Comedy Show, Kart-TeluguStop.com

దాని ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు.మొన్నటి వరకు వెండి తెరకే ఈ కష్టాలు పరిమితం అయ్యాయి అనుకుంటే ఇప్పుడు బుల్లి తెర వారికి కూడా కష్టాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

గత నెల రోజులుగా బుల్లి తెరకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి.కార్తీక దీపం నుండి జబర్దస్త్‌ కామెడీ షో వరకు అన్ని సీరియల్స్‌, షోలు కూడా షూటింగ్స్‌ లేకుండా పోయాయి.

దాంతో అందులో పని చేసే బుల్లి తెర కార్మికులు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కడుపు మాడ్చుకుంటున్నారు.కొన్ని వేల మంది షూటింగ్స్‌ జరిగితే రోజు వారి కూలీతో బతికే వారు ఉన్నారు.

అలాంటి వారు ఇప్పుడు తినడానికి తిండి లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు.

వెండి తెర సినీ కార్మికులకు కూడా సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

సీసీసీ ఆధ్వర్యంలోనే వారికి కూడా సాయం చేయాలంటూ కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.లేదంటే ఛానెల్స్‌ యాజమాన్యం ప్రస్తుతం వారిని ఆదుకునేందుకు కనీసం నిరుద్యోగ బృతిగా అయిదు వేల రూపాయలు ఇవ్వాలంటూ కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.

లేదంటే లాక్‌డౌన్‌ పూర్తి అయ్యే వరకు చాలా మంది ఆకలితో చనిపోతారంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube