వర్షాకాలంలో తీసుకోవలసిన చిన్న చిన్న జాగ్రత్తలు

ఈ కాలంలో తేమ ప్రభావం ఎక్కువగా ఉండుట వలన పాదాలకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.అందువల్ల పాదాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

 Small Precautions To Be Taken During The Rainy Season-TeluguStop.com

కాఫీ డికాషన్ లో కొంచెం సీ సాల్ట్,మొక్కజొన్న పిండి,బాదాం ఆయిల్ వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసి మసాజ్ చేసి పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ప్రతి రోజు రెండు సార్లు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.జిడ్డు చర్మ తత్త్వం కలిగిన వారు జెల్ ఫెస్ వాష్ వాడితే మంచిది.

పొడి చర్మ తత్త్వం ఉన్నవారు క్రీం ఆధారిత ఫెస్ వాష్ వాడితే బాగుంటుంది.

మస్కారా ఉపయోగించే అలవాటు ఉన్నవారు తప్పనిసరిగా నీటి ఆధారిత మస్కారా ఉపయోగించాలి.

ఈ కాలంలో జుట్టుకు కూడా సంరక్షణ ముఖ్యమే.ఘాటైన స్ప్రే లు వాడకుండా ఉండాలి.

డ్రైయర్స్ వాడటం మరియు జుట్టు స్ట్రైట్ చేయించుకోవటం వంటి వాటికీ దూరంగా ఉండాలి.గోరువెచ్చని కొబ్బరి నూనె తలకు రాసి మర్దన చేసుకుంటే సరిపోతుంది.

వర్షంలో తడిచినప్పుడు తప్పనిసరిగా తలస్నానము చేయాలి.లేకపోతె చుండ్రు సమస్య వేధిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube