సినిమా చూసే పద్ధతి మార్చిన ఈ రెండు సినిమాలు.. ఇకనైనా మారండి బాబు

చాలా రోజులుగా సినిమాకు ఉన్న పోకడ మారిపోతూ వస్తుంది.ఎన్నో వందల ఆర్టికల్స్ లో అలాగే సోషల్ మీడియాలో సినిమా అంటే థియేటర్ కి వెళ్లి చూడలేని పరిస్థితి ఉంది అని అనుకుంటూనే ఉన్నాం.

 Small Budget Movies Writer Padmabhushan Mukundan Unni Associates With Hit Talk,w-TeluguStop.com

ఎందుకంటే ఒక సినిమాకి వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు రోజురోజుకీ ఆ బడ్జెట్ పెరిగిపోతూనే ఉంది సినిమా విడుదలయ్యేసరికి 100 కాస్త 200 కోట్లు అవుతుంది.ఇక కోహ్లీ క్రికెట్లో బౌండరీలు కొట్టినట్టుగా ఒక హీరో పదుల సంఖ్యలో విలన్ గ్యాంగ్ ను కొడుతూనే ఉంటాడు.

ఎందుకు కొడుతున్నాడో ఎలా కొడుతున్నాడో అర్థం కాకుండా ఇరగదీసి కొడుతూ ఉంటూ జనాలకు మహా పూనకాలు తెప్పిస్తు ఉంటారు.సినిమా అంటే ఇంతేనా అని అనుమానం చాలా మందిలో కలుగుతుంది.

Telugu Mukundanunni, Small Budget, Tollywood-Movie

ఇక ఈ మధ్యకాలంలో అయితే మరీ దారుణంగా చిన్నపిల్లలు ఆడుకునే వస్తువుల లాగా కాట్లను లారీలను కూడా లేపి పడేస్తున్నారు హీరోలు.అక్కడితో ఆగక ఆదివారం పూట మటన్ కొట్టే మస్తాన్ మేకలను నరికినట్టు మనుషులను నరుకుతూ వెళ్తున్నారు పక్కా కమర్షియల్ తెలుగు హీరోలు.అందుకే సినిమా బడ్జెట్ పెరుగుతూ పోతుంది కానీ హీరోయిన్ కి ఇచ్చే బట్టల బడ్జెట్ తగ్గుతుంది ఎందుకంటే వేసుకునేవి ఎలాగూ రెండూ బట్ట పీలికలేగా.నోటితో మామూలు మనుషులు మాట్లాడలేని విధంగా బూతులు పెట్టి పాటలను పాడించి ఐటం సాంగ్స్ అంటూ ఆడిస్తున్నారు.

సినిమాలో కథ తప్ప మిగిలినవన్నీ కూడా కనిపిస్తున్నాయి.

Telugu Mukundanunni, Small Budget, Tollywood-Movie

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి అనే విధంగా సినిమాలో కథ ఎక్కడుందో తెలుసుకోండి అనే పరిస్థితి.అందుకే జనాలకు బోరు కొట్టించకుండా అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి.చిన్న హీరోలు మాత్రమే కాదు చిన్న కథని కూడా మంచి కథనంతో తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతాయి అని అర్థమయ్యేలా ఉన్నాయి ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక రెండు చిన్న సినిమాలు.

అందులో ఒకటి రైటర్ పద్మభూషణ్ మరొకటి ముకుందన్ ఉన్ని అసోసియేట్స్. ఈ రెండు సినిమాలు చూసిన తర్వాత సినిమాకు కావాల్సింది కోట్ల కొద్ది బడ్జెట్ కాదు అంతకన్నా పెద్ద హీరో కాదు కేవలం కథ మాత్రమే అని.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube