జక్కన్న తీసుకున్న నిర్ణయంతో చిన్న సినిమాల నిర్మాతల తెగ ఇదైపోతున్నారు

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి చిత్రం ఎంతటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ను దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించింది.

 Small Movie Producers Awakes From Rajamouli Decision-TeluguStop.com

ఆ చిత్రం తర్వాత ప్రస్తుతం జక్కన్న రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లతో మల్టీస్టారర్‌ చిత్రాలను చేస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న మల్టీస్టారర్‌ చిత్రంపైనే జక్కన్న ఫుల్‌ ఫోకస్‌ పెట్టాడు.

అందుకే ఇతర సినిమాలను చూడటం, వాటి గురించి స్పందించడం చేయడం లేదు.గతంలో జక్కన్న చిన్న పెద్ద అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చూసేవాడు.

ఆ సినిమాలపై తన రివ్యూను ఇచ్చేవాడు.

తన మనసుకు నచ్చిన ఎన్నో సినిమాలను జక్కన్న ప్రోత్సహించాడు.ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో జక్కన్న చాలా సార్లు స్పందించాడు.రాజమౌళి స్పందించడం వల్ల చిన్న సినిమాలు కాస్త పెద్ద సినిమాలు అయ్యాయి.

పెద్ద సినిమాలు భారీ ఎత్తున వసూళ్లు సాధించేందుకు రాజమౌళి కామెంట్స్‌ కూడా కొన్ని సార్లు ఉపయోగపడ్డాయి.అంతటి పవర్‌ ఉన్న రాజమౌళి రివ్యూలు గత కొంత కాలంగా రావడం లేదు.

ఎందుకంటే బిజీ షెడ్యూల్స్‌ అవ్వడంతో పాటు, కొన్ని సినిమాలపై స్పందించి, కొన్ని సినిమాలను వదిలేయడం వల్ల స్టార్స్‌ కొందరు జక్కన్నపై ఆగ్రహంతో ఉన్నారు.

అంటే హిట్‌ సినిమాను బాగుందని చెప్పడం పర్వాలేదు, కాని కొన్ని సార్లు ఫ్లాప్‌ సినిమాలను బాగుందని చెప్పలేని పరిస్థితి.ఆ సినిమాలను చూసి స్పందించలేదంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.దాంతో రాజమౌళి రివ్యూలు ఇవ్వడం మానేసినట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చిన్న సినిమాలపై ఎక్కువగా స్పందించి, వాటిని ఆదుకున్న రాజమౌళి ఇప్పుడు తన వ్యూ ను చెప్పక పోవడం చిన్న నిర్మాతలకు నష్టమే అని చెప్పుకోవచ్చు.మళ్లీ తన మనసుకు నచ్చిన ఏదైనా సినిమాను చూసి జక్కన్న స్పందిస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube