పచ్చని చెట్లతో అడవిని తలపిస్తున్న హైటెక్ బస్టాండ్..!?  

small forest at hitech bus stand in telangana, Telangana, Suryapet, Hitech Bus Stand, Teku, Vepa, Nallamadhi, Depo Manager Ramakrishna - Telugu Depo Manager Ramakrishna, Hitech Bus Stand, Nallamadhi, Suryapet, Teku, Telangana, Vepa

సూర్యాపేట జిల్లాలోని హైటెక్ బస్టాండ్ ఆవరణలో పచ్చని చెట్లతో అడవిలా కనిపిస్తుంది.ఆ పచ్చటి ఆవరణ ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతుంది.

 Small Forest At Hitech Bus Stand In Telangana

సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హైటెక్ బస్టాండ్ లో ఆర్టీసీ అధికారులు హరితహారంలో భాగంగా ప్రతి సంవత్సరం మొక్కలు నాటుతూ వచ్చేవారు.

ఇంకా ఆ మొక్కలు పెరిగి చిట్టడివిలా అందంగా కనిపిస్తున్నాయి.

పచ్చని చెట్లతో అడవిని తలపిస్తున్న హైటెక్ బస్టాండ్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంకా ఈ బస్టాండ్ వచ్చి వెళ్లే మార్గాల్లోనూ చెట్లు ఎంతో అందంగా ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్నట్టు ఉన్నాయి.అంతేకాదు.

అక్కడ కొన్ని పూలమొక్కలు కూడా ఉన్నాయి.వాటికీ ప్రత్యేకమైన కంచె ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు.

ఇంకా ఈ హరితహారంలో భాగంగా టేకు, వేప, కానుగ, నల్లమద్ది తదితర చెట్లు కూడా బస్టాండ్‌ ఆవరణాన్ని పచ్చదనంతో చల్లగాలితో ఎంతో అందంగా చేశాయి.ఇంకా బస్టాండ్ లో ఉన్న క్యాంటిన్‌ వెనుక భాగంలో మినీ పార్కు కూడా ఏర్పాటు చేశారు.

కాగా ఆరో విడతలో కొత్త బస్టాండ్‌, డిపో గ్యారేజీ ఆవరణలో ముక్కలు నాటాలని నిర్ణయించుకున్నారట.

అంతేకాదు.

హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను కొంతమంది సిబ్బందికి అప్పగించినట్టు డిపో మేనేజర్‌ రామకృష్ణ తెలిపారు.ఏది ఏమైనా హరితహారంతో బస్టాండ్ ఇంత అందంగా మారింది అంటే మంచి విషయం అనే చెప్పాలి.

#Teku #Nallamadhi #Suryapet #Telangana #Vepa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Small Forest At Hitech Bus Stand In Telangana Related Telugu News,Photos/Pics,Images..