లేట్‌ అయిన జగదీష్‌ కు రిపేర్లు.. నాని అనుమానం

నాని హీరోగా రీతూ వర్మ మరియు ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్ లు గా నటించిన టక్ జగదీష్‌ కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా విడుదల వాయిదా పడింది.గత ఏడాది నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.‘వి‘ సినిమా తర్వాత నాని ఈ సినిమా పై చాలా అంచనాలు పెట్టుకున్నాడు.ఆ సినిమా నిరాశ పర్చినా కూడా ఈ సినిమా తో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకుంటాను అనే నమ్మకంతో ఉన్న నాని ఇటీవల ఫైనల్‌ వర్షన్ చూసిన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేశాడట.

 Small Editing Changes In Hero Nani And Shiva Nirvana Tuck Jagadhish Movie , Film-TeluguStop.com

సినిమా లోని పలు సన్నివేశాలు మరీ క్లంబ్జీ గా ఉన్నాయంటూ నాని వ్యాఖ్యలు చేశాడట.ఇలా ఉంటే సినిమా ఫలితం తారు మారు అయ్యే ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నాడట.

అందుకే రిపేర్లు మొదలు పెట్టమని దర్శకుడు శివ నిర్వానకు సూచించాడని సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం టక్‌ జగదీష్ సినిమా లోని పలు సన్నివేశాలు మరియు పాటల ప్లేస్ మెంట్‌ విషయంలో నాని చేసిన సూచన మేరకు మార్పులు చేర్పులు చేస్తున్నారని తెలుస్తోంది.

అవసరం అయితే వారం పది రోజులు మళ్లీ షూటింగ్ కు కూడా తాను సిద్దం అంటూ నాని చెప్పాడట.కాని ఇప్పుడు మళ్లీ షూటింగ్‌ అంటే సాధ్యం అయ్యే పని కాదు.

ఇప్పటికే సినిమా వాయిదా పడటం వల్ల భారీగా భారం పెరిగింది.

Telugu Clumsytuck, Nani, Shiva Nirvana, Tuck Jagadish, Tuckjagadish-Movie

ఇప్పుడు సినిమా రీ షూట్ అంటే కోట్ల తో పని.అందుకే రీ షూట్‌ విషయమై నిర్ణయంను ఉపసంహరించుకున్నారట.కాని రీ ఎడిట్‌ మాత్రం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం సినిమా పై అభిమానుల్లో అంచనాలు భారీగా నే ఉన్నాయి.ఎందుకంటే నాని మరియు శివ నిర్వానల గత చిత్రం ‘నిన్ను కోరి’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

అందుకే ఈ సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు.సినిమా విడుదల విషయమై వారం పది రోజుల్లో క్లారిటీ ఇవ్వబోతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube