ఆశ చూపించి చిన్న నిర్మాతలను ముంచేస్తున్న ఓటీటీలు

చిన్న సినిమాలను విడుదల చేసేందుకు థియేటర్లు దొరక్క పోవడంతో నిర్మాతలు నష్టాలపాలయిన సందర్బాలు చాలా ఉన్నాయి.థియేటర్లు లేకున్నా ఓటీటీలు ఉన్నాయి.

 Small Budget Movie Producers Facing Problems With Ott Also-TeluguStop.com

చిన్న సినిమాలకు కూడా మంచి రేటును పెట్టి ఓటీటీ వారు కొనుగోలు చేస్తున్నారు.దాంతో చాలా మంది నిర్మాతలు ఓటీటీల కోసం సినిమాలను నిర్మించిన దాఖలాలు ఉన్నాయి.

వరుసగా చిన్న సినిమాలు ఓటీటీ దారి పడుతున్న నేపథ్యంలో ఓటీటీ వారు కూడా కొత్త పంథాను ఎంచుకున్నారు.తమ ఓటీటీల్లో చిన్న సినిమానలు విడుదల చేసేందుకు ఓకే కాని పే పర్‌ వ్యూ పద్దతిని అమౌంట్‌ ఇస్తామంటూ చెబుతున్నారు.

 Small Budget Movie Producers Facing Problems With Ott Also-ఆశ చూపించి చిన్న నిర్మాతలను ముంచేస్తున్న ఓటీటీలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది ఎంత వరకు కరెక్ట్‌ అంటే మాత్రం ఓటీటీ వారు స్పందించడం లేదు.

పెద్ద సినిమాలను స్ట్రీమింగ్‌ కు ముందే కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్న ఓటీటీ వారు చిన్న సినిమాల విషయానికి వస్తే సినిమాను తీసుకుంటున్నారు ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో చాలా మంది నిర్మాతలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.ఒక నిర్మాత ప్రముఖ ఓటీటీకి సినిమాను అమ్మేశాడు.

ఆ సినిమా సరిగా ఆడకపోవడంతో ఆ ఓటీటీ వారు ఇప్పుడు డబ్బులు ఇచ్చేందుకు నో చెబుతున్నారట.దాంతో అప్పు తీసుకు వచ్చి సినిమాను చేసిన ఆ నిర్మాత ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు.

చిన్న నిర్మాతలను ఇన్నాళ్లు పెద్ద నిర్మాతలు థియేటర్ల యాజమాన్యాలు మాత్రమే ఆడుకున్నాయి.ఇప్పుడు ఓటీటీ వారు కూడా ఆడుకుంటున్నారు.

ఇలా అయితే చిన్న నిర్మాతలు ఎదగడం కష్టం అంటూ సినీ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బిజినెస్‌ విషయంలో ఓటీటీ లు చిన్న నిర్మాతలను నష్టాల్లో మిగల్చకుండే ముందే అమౌంట్‌ ఇవ్వాలి.

సినిమా వ్యూస్‌ ను బట్టి ఆ తర్వాత అమౌంట్‌ ఇవ్వాలని కొందరు అంటున్నారు.

#Aha OTT #Small Budget #Prime

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు