ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్ల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తోంది.ఈ వీడియోలో రోడ్డుపై ఆగి ఉన్న ఒక కారుపై పిడుగు పడటం కనిపించింది.
ఈ దృశ్యాన్ని వెనక ఉన్న మరొక కారులోని ప్రయాణికులు ఫోన్‌లో రికార్డ్ చేశారు.స్లో మోషన్ లో వారు దీన్ని రికార్డ్ చేశారు.
ఆ వీడియో ప్రకారం, ఆకాశాన్ని చీల్చుకుంటూ భూమి మీదకు దూసుకొచ్చిన ఆ పిడుగు కారును( Car ) ధ్వంసం చేసింది.అందులో నుంచి పొగలు కూడా వెలువెత్తాయి.
కొద్ది సెకన్ల పాటు ఆ పిడుగు నిప్పుల వర్షంతో భయంకరమైన శబ్దంతో బీభత్సం సృష్టించింది.
@explosionvidz అనే ప్రముఖ ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.ఈ వీడియోకు క్యాప్షన్‌గా స్లో మో ఫుటేజ్ ఆఫ్ ఏ లైటింగ్ స్ట్రైక్ అని యాడ్ చేశారు.షేర్ చేసిన సమయం నుంచి ఈ వీడియోకు 2 లక్షల 43 వేల వ్యూస్ వచ్చాయి.
దీన్ని చూసిన ట్విట్టర్ యూజర్లు షాక్ అవుతున్నారు.పిడుగు ( Lightning Strike ) ఇంత భయానకంగా పడుతుందా అని వారు తమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
ఈ దృశ్యం భీతావహ వాతావరణాన్ని క్రియేట్ చేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.కాగా ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదు అని సమాచారం.
ఇకపోతే ప్రస్తుతం భారతదేశంలో వర్షాకాలం( Monsoon ) కొనసాగుతోంది.ఈ క్రమంలో దేశమంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.పిడుగులు పడే ప్రమాదం కూడా పెరిగిపోయింది.పిడుగులు భారతదేశంలో ప్రాణాలకు, ఆస్తికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి.వీటి వల్ల దేశంలో సగటున సంవత్సరానికి 2,000 మరణిస్తున్నారు.5,000 గాయాల పాలవుతున్నారు.పర్వత ప్రాంతాలలో, ఎత్తైన నిర్మాణాలకు సమీపంలో కూడా పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంది.కాబట్టి ఆ ప్రాంతాలలో భారీ వర్షాలు వచ్చేటప్పుడు, ఉరుములు ఉరుముతున్నప్పుడు, పిడుగులు పడే సమయంలో ఇంట్లోనే ఉండడం మంచిది.