ఫ్లయింగ్ కార్ షురూ.. మరి మీరు ప్రయాణానికి సిద్ధం అవ్వండి..!

మనిషి కోరికలకు, ఆశలకు హద్దు ఉండదు.ఎందుకంటే ఒక్కోసారి మనిషి కి పుట్టే లెక్కలేనన్ని కోరికలు ఆకాశాన్ని దాటతాయి.

 Slovac Flying Car Gets Ready With Official Certification Details, Flying Car, El-TeluguStop.com

అవన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ మనిషి తన కలలను సాకారం చేసుకుంటూ వస్తాడు.మనిషి కలలకు అంతం లేదు.

ఉన్నవాడు లేనివాడిని చూసి అలా బతకాలని అనుకోవడంలో తప్పు లేదు.సైకిల్ పై వెళ్లే వ్యక్తి విమానం ఎక్కి ఆకాశంలో విహరించాలని కోరుకుంటాడు.

ఆకాశమే హద్దుగా ఆ కలలను నెరవేర్చుకుంటూ పోతుంటాడు.అయితే ఇప్పటిదాకా ఆకాశంలో విహరించే విమానంను మాత్రమే చూసి ఉంటాం.

కానీ ఆకాశంలో ఎగిరే ఎయిర్ క్రాఫ్ట్-కారును మీరు ఎప్పుడైనా చూసారా.కారులో గాల్లో ఎగురుతూ ప్రయాణం ఎప్పుడైనా చేశారా…? వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా త్వరలోనే నిజం కాబోతోంది.

దీని అర్థం ఫ్లయింగ్ కారులో ఆకాశంలో విహరించడం అన్నమాట.ఫ్లయింగ్ కారులో విహరించడం అనే ఊహనే భలే ఉంది కదా.ఇప్పుడు ఆ ఊహను నిజం చేసారు.మనిషి అనుకుంటే సాధించలేనిది అంటూ ఏమీ లేదు అనడానికి ఈ హైబ్రిడ్ కారు ఒక ఉదాహరణ అనే చెప్పాలి.160 కిలోమీటర్ల వేగంతో ఈ హైబ్రిడ్ కారు గాల్లో ఎగరగలదు.అలాగే ఆకాశంలో 8వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఇది ప్రయాణించగలదు.

ఈ హైబ్రిడ్ కారుకు సంబంధించిన ధ్రువపత్రాలను స్లోవాక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ జారీ చేసినట్లు సంస్థ వెల్లడించింది.ఈ హైబ్రిడ్ కారును 70 గంటల పాటు పరిశీలించిన తర్వాత ఇది చాలా బాగుంది అని తెలిపారు.ఈ పరీక్షల్లో భాగంగా 200 టేకాఫ్ ల్యాండిగ్ పరీక్షలు చేశామని నిర్వాహకులు వివరించారు.

ఈ హైబ్రిడ్ కారు-ఎయిర్ క్రాఫ్ట్ కు బీఎండబ్ల్యూ ఇంజిన్ ను అమర్చడంతో పాటు కారుకు ఇరువైపులా చిన్న రెక్కలను కూడా అమర్చారు.

ఇది గాల్లోకి వెళ్తున్నప్పుడు ఆ రెక్కలు విచ్చుకుంటాయి.కారు రోడ్డు నుంచి గాల్లోకి వెళ్లడానికి కొంత సమయం పడుతుందట.

రన్ వే మీది నుంచి టేకాఫ్ అవడానికి 2 నిమిషాల 15 సెకండ్ల సమయం పడుతుందని ఈ కారును తయారు చేసిన నిపుణుడు ప్రొఫెసర్ స్టీఫెన్ క్లీన్ తెలిపారు.మరి ఈ కారులో గరిష్టంగా ఇద్దరు ప్రయాణించవచ్చని క్లీన్ వెల్లడించారు.ఈథర్ ఇది టేకాఫ్ అవడానికి గాని ల్యాండ్ అవడానికి గాని ఒక ప్రత్యేకమైన రన్ వే ఉండాల్సిందనీ ఆయన తెలిపారు.ఇంకా గాల్లో ఎగిరే కారు రెడీ అయింది.

మరి ఆకాశంలో కారులో విహరించడానికి మీరు కూడా రెడీ అవ్వండి.!

.

Slovac Flying Car Gets Ready With Official Certification Details, Flying Car, Electric Cars, Travel, Latest News, Viral Latest, Slovac Flying Car , Official Certification, Slovac Transport Authority, Hybrid Air Craft, Bmw Engine - Telugu Bmw Engine, Electric Cars, Car, Latest, Official, Slovac Car, Travel

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube