అవి తీసుకున్న వారు 7 గంటల వరకూ ఓటెయ్యవచ్చు     2018-12-06   20:03:07  IST  Sai M

తెలంగాణాలో రేపు జరగనున్న పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది అని … ఆ తరువాత లైన్లో ఉన్నవారికి టోకెన్స్ ఇస్తామని… ఎన్నికల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రజిత్ కుమార్ తెలిపారు. సాయంత్రం 5గంటల లోపు టోకెన్ తీసుకున్న వారికోసం రాత్రి 7గంటలకు పోలింగ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వారు 7గంటల వరకు వారి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందన్నారు.

Slips Can Be Waived For Up To 7 Pm Announced By Ec-

రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మద్యం పెద్ద ఎత్తున పంపిణీ అయ్యే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. దాన్ని అరికట్టేందుకు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎపిక్ కార్డు లేకపోతే ఓటర్ స్లీప్ తో పాటు 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకొని వస్తే సరిపోతుందని తెలిపారు. అన్ని జిల్లాల్లో ఎపిక్ కార్డులు, ఓటర్ స్లిప్స్ పంపిణీ చేశాం. 26 డిసెంబర్ నుంచి పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారు చేస్తామని తెలిపారు. ఓటు లేని వాళ్ళు అందరూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు అని సూచించారు. 13 నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. మిగితా చోట్లా సాయంత్రం 5వరకు పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.