అన్నం లో నిద్రమాత్రలు కలిపి ..   Sleeping Tablets In Food?     2016-02-19   01:22:13  IST  Raghu V

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సినీఫక్కీలో చోరీకి విఫలయత్నం జరిగింది. భోజనం కోసమంటూ ఇంటికి పిలిచి.. నిలువు దోపిడీ చేయాలనుకున్న మహిళ జైలు పాలయ్యింది. వివరాల్లోకి వెళితే..నాయడుపేట పట్టణంలోని రాజగోపాలపురంలో సుగుణమ్మ అనే మహిళ ఇటీవల అద్దెకు దిగింది. అత్తగారి సంవత్సరీకం చేస్తున్నామంటూ.. సంపన్న కుటుంబానికి చెందిన రత్నమ్మ అనే మహిళను ఇంటికి ఆహ్వానించింది.

భోజనం చేసి వెళ్ళాలంటూ బలవంతం చేసింది. భోజనంలో నిద్రమాత్రలు కలిపి… వంటిపై నగలు కాజేయాలని ప్లాన్‌ చేసింది. కానీ మత్తు మాత్రలు పని చేయక పోవటంతో… దోపిడీ యత్నాన్ని రత్నమ్మ ప్రతిఘటించింది. రత్నమ్మ కేకలు విన్న ఇరుగు పొరుగు వారు… సుగుణమ్మకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.