కెమెరా ముందు పడుకొని కోట్లు సంపాదిస్తున్నాడు.. అశ్లీలంగా కాదండోయ్!

ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని తపనపడుతుంటారు.ఇందుకోసం వివిధ మార్గాలను ఆశ్రయిస్తుంటారు.

 Sleeping In Front Of Camera A Person Earned In Lakhs ,  Camera  ,  Sleeping ,  S-TeluguStop.com

ఇందుకోసం కొందరు ఉద్యోగాలు చేస్తుంటే.మరికొందరు వ్యాపారాలు చేస్తుంటారు.

అయితే ఇటీవలి కాలంలో కొందరు సోషల్ మీడియా ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నారు.ముఖ్యంగా యూట్యూబ్ డబ్బు సంపాదించడానికి మంచి మార్గంగా మారింది.

యూట్యూబర్లు తమ వీడియోలను షేర్ చేయడం ద్వారా అత్యధిక వీక్షణలు పొందుతూ సబ్‌స్క్రైబర్‌ల నుంచి డబ్బు సంపాదిస్తున్నారు.కొందరు యూట్యూబర్లు విచిత్రమైన పద్ధతులను అవలంబిస్తున్నారు.

ఒక వ్యక్తి నిద్రపోతూ డబ్బు సంపాదిస్తున్నాడు.అతని యూట్యూబ్ పేరు సూపర్ మెయిన్ స్ట్రీమ్.

తాను ఒంటరిగా నిద్రిస్తున్నప్పుడు తన వీడియోను ప్రత్యక్షంగా రికార్డ్ చేసి, అనంతరం దానిని యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తాడు.

అతని వీడియోలను చూసేవాళ్లు లక్షల రూపాయల మొత్తాన్ని సదరు వ్యక్తి ఖాతాలోకి జమ చేస్తారు.

ఈ యూట్యూబర్ నిద్ర పోయే భంగిమలు ఈ వీడియోలో కనిపిస్తాయి.వారానికి ఒకసారి ఆరు గంటల యూట్యూబ్ లైవ్ చేయడం ద్వారా రూ.2 లక్షలు సంపాదించినట్లు సదరు యూ ట్యూబర్ తెలిపాడు.ఈ యూట్యూబర్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అతని వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.అతను వేలాది మంది ప్రేక్షకుల ముందు నిద్రను ప్రత్యక్షంగా ప్రదర్శించాడు.

అలాగే అత్యధిక సమయం నిద్రలోనే గడుపుతాడు.అతని అభిమానులు ఫోన్ చేసి అతన్ని నిద్రలేపడానికి ప్రయత్నిస్తారు.

సూపర్ మెయిన్ స్ట్రీమ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ అత్యధికంగా ఉంది.రోజు రోజుకు నెటిజన్లు అతనిని అమితంగా ఇష్టపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube