నిద్ర త‌క్కువ పోతున్నారా.. అయితే ఎంత డేంజ‌రో తెలుసుకోండి..

ప్ర‌తి మ‌నిషి జీవితంలో నిద్ర అనేది ఎంత ముఖ్య‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.స‌గం జీవితం ప‌డుకోవ‌డానికే వెళ్తుందంటే దీనికున్న ప్రాధాన్య‌త ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

 Sleep Deprivation But Find Out How Dangerous It Is , Sleep Deprivation, Viral Ne-TeluguStop.com

ఒక‌ప్పటికి ఇప్ప‌టికీ ప‌రిస్థితులు చాలా మారిపోయాయి.ఇప్ప‌టి వారికి ప‌ని ఒత్తిడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

అనేక ర‌కాల ఒత్తిడిలు, టెన్ష‌న్లు, బిజీ లైఫ్ లో చాలామంది స‌రిగ్గా నిద్ర పోవ‌ట్లేదు.ఒక వేళ నిద్ర పోతున్నా కూడా అది సంపూర్ణ‌మైన నిద్ర కాద‌నే చెప్పాలి.

అయితే ఇలా రోజులో చాలా త‌క్కువ టైమ్ నిద్రపోయే వారికి ఓ న్యూస్ తీసుకొచ్చాం.

ఇప్పుడున్న స‌మాజంలో నిద్ర‌లేమితో బాధ‌ప‌డుతున్న వారు కోకొల్ల‌లు.

టైమ్ పాస్ కోసం చాలామంది రాత్రుళ్లూ స్మార్ట్ ఫోన్ల‌తోనే వెళ్ల‌దీస్తున్నారు.తెల్లవారు జామున దాకా ఫోన్ లేకుండా ఉండ‌ని వారున్నారు.

ఎప్పుడో తెల్లారే టైమ్ కు ప‌డుకుని మ‌ళ్లీ మార్నింగ్ 10లోపు లేచే వారు చాలా మందే ఉన్నారు.ఇలాంటి వారికి సైంటిస్టులు షాకింగ్ న్యూస్ వెల్ల‌డించారు.

రోజులో సరైన నిద్రలేని వారిలో మెదడుపై ఎఫెక్ట్‌ ప‌డుతుంద‌ని వారు వెల్ల‌డించారు.ఇలాంటి వారిలో ఆలోచన శక్తి త‌గ్గిపోయి గందర గోళంగా ఆలోచ‌న‌లు ఉంటాయ‌ని వెల్ల‌డిస్తున్నారు.

7.30 గంటల కంటే త‌క్కువ నిద్ర‌పోతే మాత్రం వారికి భయంకరమైన వ్యాధులు వ‌స్తున్నాయ‌ని అమెరికాలోని పెన్సిల్వేనియా సైంటిస్టులు రీసెంట్ స‌ర్వేలో వెల్ల‌డించారు.15 మంది అబ్బాయిల‌ను ఇలా పదిరోజుల దాకా రోజుకు క‌నీసం 5 గంటలకంటే ఎక్కువ ప‌డుకోనివ్వ‌కుండా చూసి వారిమీద ఈ స‌ర్వేను నిర్వ‌హించారు.వారిలో గ్లూకోజ్ అలాగే కొవ్వు పదార్థాలు శ‌రీరంలో విప‌రీతంగా పెరిగిపోతున్నాయ‌ని గుర్తించారు.

జీవక్రియల రేటు కూడా భ‌రీగా ప‌డిపోతుంద‌ని తెలిపారు.ఇది అంతి మంగా షుగర్, స్థూలకాయం లాంటి ప్ర‌మాదాల‌కు దారి తీస్తుంద‌ని కాబ‌ట్టి రోజుకు 8గంట‌ల‌కు త‌క్కువ కాకుండా ప‌డుకోవాల‌ని సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube