ఆకాశం నుండి జారిన ఆకుపచ్చ అగ్నిగోళం... అసలేంటదని అంటున్న ప్రజలు ...!

ప్రపంచంలో ఏదో మూలన రోజుకి అనేక ఉల్కలు, తోకచుక్కలు, గ్రహశకలాలు భూమిపైకి ప్రయాణం చేస్తూనే ఉంటాయి.అలాగే కొన్ని పక్క నుంచి కూడా భూమికి దగ్గరగా వెళ్లడం మనం గమనిస్తూనే ఉంటాం.

 A Green Fireball That Slid From The Sky, A Green Fireball,slid From The Sky, Aus-TeluguStop.com

ఇకపోతే తాజాగా ఆస్ట్రేలియా దేశంలోని పిల్ బారాలో కనపడిన అగ్నిగోళం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.అది ఎందుకంటే…

ఏదైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అగ్నిగోళాలు మామూలుగా ఎర్ర లేదా తెలుపు, పసుపు రంగులతో మనకు కనిపిస్తాయి.

అయితే తాజాగా పడిన ఓ అగ్నిగోళం ఆకుపచ్చ రంగులో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.మరి ఇప్పుడు ఇది ఎందుకు ఆకుపచ్చగా వచ్చిందని ప్రజలు చర్చకు దారితీస్తున్నాయి.

ఇక కొందరైతే ” వావ్ వాట్ ఏ కలర్ “ అంటూ వీడియో తీశారు కొందరు.ఇకపోతే ప్రస్తుతం ఈ ఉదంతాము మొత్తం యూఫాలజిస్టుల చేతిలోకి వెళ్ళింది.

ఏప్రిల్ నెలలో అమెరికా రక్షణ విభాగం ఎగిరే పళ్ళాలు ఉన్నాయంటూ ఒక వీడియోని రిలీజ్ చేసిన సంగతి అందరికీ విదితమే.ఇకపోతే తాజాగా జరిగిన ఈ సంఘటన కూడా ఏలియన్స్ కు లింక్ పెడుతున్నారు యూఫాలజిస్టులు.

ఏది ఏమైనా 2020 సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు జరగడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు.అయితే ఈ అగ్నిగోళం ఆస్ట్రేలియా లో కచ్చితంగా ఎక్కడ పడిందో కూడా ఇంకా పూర్తి సమాచారం అందలేదు.

ఈ విషయంపై కొందరు ఇటీవల నాసా పంపిన రాకెట్ సంబంధించి శకలం అయిండొచ్చని, మరికొందరైతే ఎగిరే పళ్ళాలు కావచ్చని అనుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube