పొద్దున్నే అది అలవాటు చేసుకోకపోతే రక్తనాళాలు దెబ్బతింటాయట  

Skipping Breakfast Could Harden Arteries – Study-

పొద్దున్నే ఏం తింటారు? టీ తాగి అక్కడితో ఆపేస్తారా? ఇడ్లీ, వడ, దొశ ‌. ఇలా ఏదో ఒక టిఫిన్ లాగించేస్తారా? లేదంటే ఆఫీస్ లేదా, స్కూల్ కి సరిగ్గా అరగంట ముందు నిద్రలేచి, పోలోమంటూ పరుగులు తీస్తూ, టిఫిన్ తినడమే మానేస్తారా? ఒకవేళ మీరు మొదడి క్యాటగిరి లేదా మూడొవ క్యాటగిరి మనుషులైతే ఒక్కసారి గూగుల్ లోకి వెళ్ళి atherosclerosis అని టైప్ చేసి చూడండి..

పొద్దున్నే అది అలవాటు చేసుకోకపోతే రక్తనాళాలు దెబ్బతింటాయట -

ఎందుకంటే ఈ ప్రమాదం గురించి, అది భవిష్యత్తులో తీసుకొచ్చే సమస్యల గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇంతకుముందు చెప్పాం, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాం, బ్రేక్ ఫాస్ట్ అనేది చాలా ముఖ్యమైన మీల్. ఎందుకు అంటే, రాత్రి నిద్రతీస్తూ మనం 8-9 గంటలపాటు ఏమి తినకుండా ఉంటాం, ఏమి తాగకుండా ఉంటాం. ఓరకంగా చెప్పాలంటే ఉపవాసం చేస్తాం అన్నమాట.

ఆ ఉపవాసాన్ని వదిలేయడం, fast ని break చేస్తాం కాబట్టే దాన్ని breakfast అని అంటారు. ఈ బ్రేక్ ఫాస్ట్ తినకుండా ఉండటం వలన ఒబేసిటి, డయాబెటిస్, హై కొలెస్టరాల్ లాంటి సమస్యలు వస్తాయని మనకు ఇప్పటికే తెలుసు‌. వీటికి అదనంగా atherosclerosis, అంటే ధమనులు గట్టిపడటం లేదా టైట్ గా మారడం కూడా జరుగుతుంది అంట.

అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలొజి వారు ఈ టాపిక్ మీద చాలా పెద్ద రీసెర్చి చేసారు. ఈ పరిశోధనలో ఏకంగా 4,052 మంది. ఇందులో 3% మందికి అసలు బ్రేక్ ఫాస్ట్ తీసుకునే అలవాటే లేదంట. 69% మంది కేవలం టీ, కాఫీ, లేదంటే ఏదో ఒక జ్యూస్ తో పనికానిచ్చేస్తున్నారట. కేవలం 28% మంది మాత్రమే, బ్రేక్ ఫాస్ట్ లోకి మంచి ఆహారం, అవసరమైనన్ని కాలరీలు తీసుకుంటున్నారట.

ఇలా బ్రేక్ ఫాస్ట్ సరిగా చేయనివారికి, పూర్తిగా చేసే అలవాటు లేని వారికి, మెడలో మరియు కడుపులో రక్త ధమనులు గట్టి పడటం గమనించారు పరిశోధకులు. ఇక మీరే అర్థం చేసుకోండి ధమనులు ఇలా గట్టిపడితే భవిష్యత్తులో ఎన్ని ప్రమాదాలు చూడాల్సివస్తుందో.

గుండె పనితీరు దెబ్బతింటుంది. శరీరానికి ఆక్సజన్ లెవల్స్ సరిగా అందవు‌. ఇలాంటి పరిస్థితుల్లో ఒకదాని తరువాత మరొకటి, శరీర అవయవాలన్ని పనిచేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయి.

ఇన్ని సమస్యలు తెచ్చుకునే బదులు, ఉదయంపూట ఆహారం తప్పకుండా తీసుకోండి. బ్రేక్ ఫాస్ట్ లో మన రోజువారి కాలరీ కౌంట్ లో కనీసం 23% అయినా పొందెలా మీ డైట్ ని ప్లాన్ చేసుకోండి.