మగవారిలో వచ్చే మొటిమలకు అద్భుతమైన టిప్స్  

Skincare Tips Men With Oily Skin -

ఆయిలీ స్కిన్ కారణంగా మొటిమలు వస్తాయి.అయితే ఈ ఆయిలీ స్కిన్ సమస్య ఆడవారిలోనే కాకుండా మగవారిలో కూడా ఉంటుంది.

చర్మంలో అధికముగా నూనె ఉండటం వలన మొటిమలకు కారణం అవుతుంది.ఆ మొటిమలను,మచ్చలను తగ్గించుకోవటానికి అద్భుతమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి.

మగవారిలో వచ్చే మొటిమలకు అద్భుతమైన టిప్స్-Telugu Health-Telugu Tollywood Photo Image

ఈ రోజుల్లో మగవారు కూడా అందం మీద శ్రద్ద పెట్టటం ఎక్కువ అయింది.కాబట్టి ఆందోళన పడకుండా ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

జిడ్డును తొలగించటానికి టోనర్ ని రోజులో రెండు సార్లు ఉపయోగించాలి.ఈ టోనర్ ని ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు.వీటికి ఆపిల్ సైడర్ వెనిగర్, డిస్టిల్ వాటర్ అవసరం అవుతాయి.

మూడు వంతుల ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఒక వంతు డిస్టిల్ వాటర్ ని కలపాలి.ఈ మిశ్రమాన్ని బయటకు వెళ్ళినప్పుడు కాటన్ సాయంతో ముఖాన్ని తుడవాలి.

అలాగే రాత్రి పడుకొనే ముందు కూడా ఇలానే చేయాలి.

ఒక స్పూన్ పాలలో 5 చుక్కల లావెండర్ నూనెను కలిపి ముఖానికి రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తే జిడ్డు సమస్య తొలగి మొటిమలు తగ్గుతాయి.

ఒక స్పూన్ పెరుగులో ఒక స్పూన్ ఓట్ మీల్ పొడి,అరస్పూన్ కలబంద జెల్ కలిపి ముఖానికి రాసి పావుగంట తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు