ఇలా చేస్తే నల్లని ముఖం నిమిషంలో తెల్లగా,కాంతివంతంగా మారుతుంది  

Skin Whitening Miracle Formula Fair Skin In Just 5 Minutes - Telugu Beauty Tips, Home Remedies, How To Get Clear And Smooth Skin, Skin Care At Home, Skin Whitening

టమోటాను మనం ఎక్కువగా వంటల్లో వాడతాం.టమాటాను వాడటం వలన వంటకు మంచి రుచి వస్తుంది.

Skin Whitening Miracle Formula Fair Skin In Just 5 Minutes

అలాగే టమోటాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా టమోటా చర్మ సంరక్షణలో బాగా సహాయపడుతుంది.

టమోటాలో విటమిన్ సి,ఆంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మంపై పేరుకున్న మలినాలను తొలగించటానికి సహాయపడుతుంది.టమోటాలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు చర్మంపై నలుపును తొలగించి తెల్లగా అయ్యేలా చేస్తాయి.

ఇలా చేస్తే నల్లని ముఖం నిమిషంలో తెల్లగా,కాంతివంతంగా మారుతుంది-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

ఈ రోజుల్లో చాలా మందికి ముఖం మీద మలినాలు పేరుకొనిపోయి నల్లగా మారటం,మొటిమలు ,మొటిమల మచ్చలు,మొటిమల గుంటలు ఏర్పడటం జరుగుతుంది.దాంతో ముఖం అంద విహీనంగా మరియు రఫ్ గా కనిపిస్తుంది.

ఆలా మారిపోయిన ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మారాలంటే టమోటాతో ఏమి చేయాలో తెలుసుకుందాం.దీనికి కావలసిన పదార్ధాలు టమోటా,పసుపు.

చాలా మంది ముఖం నల్లగా మారుతుందని,రఫ్ గా ఉంటుందని పసుపు వాడటానికి ఇష్టపడరు.పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్,యాంటీ సెప్టిక్ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.

పసుపు దెబ్బతిన్న కణాలను రిపేర్ చేస్తుంది.పసుపును మాత్రం మార్కెట్ లో అమ్మే పేకెట్స్ వాడకుండా ఉంటేనే మంచిది.

ఎందుకంటే పేకెట్ పసుపులో కెమికల్స్ ఉంటాయి.అవి చర్మానికి హాని కలిగిస్తాయి.

పసుపుకొమ్ములను ఆడించి తయారుచేసిన పసుపును వాడితే మంచిది.ఇలా ఆడించిన పసుపులో ఎటువంటిసైడ్ ఎఫెక్ట్స్ రావు.

ఇప్పుడు ఈ చిట్కాను ఎలా ఫాలో అవ్వాలో తెలుసుకుందాం.టమోటాను సగానికి కోసి పసుపులో అద్ది ముఖం మీద రుద్దాలి.

రుద్దినప్పుడు టమోటా రసంను కూడా పిండుతూ రుద్దాలి.ఇలా 5 నిమిషాల పాటు మసాజ్ చేసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి.

ఈ విధంగా చేయటం వలన ముఖ చర్మంలోని మృతకణాలు,మురికి అన్ని తొలగిపోతాయి.ఈ విధంగా వారంలో రెండు నుంచి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

చూసారుగా ఫ్రెండ్స్ ముఖ చర్మం నల్లగా ఉందని బాధపడకుండా ఏ చిట్కాను ఉపయోగించి మీ ముఖ చర్మాన్ని తెల్లగా,కాంతివంతంగా చేసుకోండి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు