స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది.ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ఈ క్రమంలో చంద్రబాబు కంటి ఆపరేషన్ కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కాగా ఈ పిటిషన్ పై చంద్రబాబు తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించనుండగా వర్చువల్ గా సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు.
కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.