'స్కంద' రిలీజ్ డేట్ మార్పు.. సలార్ డేట్ ను ఫిక్స్.. పోస్టర్ అదిరింది!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో సలార్( Salar ) ఒకటి.

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

కానీ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండడం వల్ల వాయిదా పడింది అని గత కొద్దిరోజుల నుండే రూమర్స్ వస్తున్నాయి.కానీ ఇంత వరకు మేకర్స్ నుండి అధికారిక ప్రకటన అనేది రాలేదు.

అయితే ఇప్పుడు అదే డేట్ కు మరొక భారీ యాక్షన్ మూవీ రిలీజ్ కాబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది.దీంతో సలార్ మూవీ వాయిదా నిజమే అని కన్ఫర్మ్ అయిపోయింది.

మరి అదే డేట్ కు రిలీజ్ కాబోతున్న సినిమా ఏంటి అంటే రామ్ బోయపాటి స్కంద( Skanda ).

Advertisement

రామ్ పోతినేని హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ ( Director Boyapati Srinivas )తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ స్కంద.బోయపాటి అంటేనే ఫుల్ ఊర మాస్.మరి అలాంటి బోయపాటితో రామ్ సినిమా అంటే థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం.

ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టు కోవడంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో రామ్ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి.సెప్టెంబర్ 15న ఈ సినిమాను పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు.కానీ ఇప్పుడు ఈ డేట్ కు ఈ సినిమా రావడం లేదట.

ఈ రోజు అధికారికంగా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు.సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అని సరికొత్త పోస్టర్ తో ప్రకటించడంతో సలార్ వాయిదా కన్ఫర్మ్ అయినట్టే అని తెలుస్తుంది.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు