దర్శకుడు బలవంతం చేస్తే పవన్ కళ్యాణ్ తో ఆ పని చేసిందట     2016-12-27   04:40:50  IST  Raghu V

నికిషా పటేల్ అంటే ఎవరో ఇక్కడ అందరికి తెలుసుగా? తెలియక పోయినా మీ తప్పేం లేదండి. పవన్ కళ్యాణ్ లాంటి అగ్రనటుడితో నటించిన కూడా జనాలకి అసలు గుర్తే లేని హీరోయిన్ తను. ఇదో విచిత్రం కదా! నికిషా పవన్ సరసన కొమరం పులిలో జోడి కట్టింది. యూకేలో పుట్టిపెరిగిన ఈ సుందరాంగికి అదే తొలి సినిమా.

కాని ఆ సినిమా తన ఇష్టంతో మాత్రం చేయలేదు అంటోంది నికిషా. ఇన్నేళ్ళ తరువాత, తన కెరీర్ ఎక్కడికి పోతోందో అర్థం కాని సమయంలో పాతరోజులు గుర్తొచ్చాయేమో … అసలు తనకి దక్షిణాది సినిమా మీద ఆసక్తి లేదని, బాలివుడ్ సినిమాతో ఎంట్రి ఇద్దామని అనుకున్నాను కాని ఎస్ జే సూర్య బాగా బలవంతం చేసేసరికి, పవన్ కళ్యాణ్ తో పని చేయడం వలన మరిన్ని అవకాశాలు వస్తాయేమో అని ఆశతో ఆ సినిమా చేసాను తప్ప, ఇష్టంతో మాత్రం కాదని చెప్పింది నికిషా.

అయితే ఆ సినిమా ఫ్లాప్ అవడంతో తనకు అవకాశాలు రాలేదని వాపోయింది. కొన్నిరోజులు కన్నడ ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేసిన నికీషా, ఇప్పుడు ఒకటిరెండు చిన్నచితక సినిమాలతో బండి నెట్టుకొస్తోంది.