బెంగాల్‌లో మొదలైన ఆరో విడుత పోలింగ్‌.. పోటీ చేస్తున్న స్దానాలు ఎన్నంటే.. ?

దేశంలో ఒక వైపు కరోనా వ్యాప్తి ఆగడం లేదు.ఇదే సమయంలో ఎన్నికల ప్రవాహం కూడా తగ్గడం లేదు.

 Sixth Phase Of Polling Begins In West Bengal , Bengal, Congress, Cpi, Trinamool-TeluguStop.com

ఇప్పటికే అన్ని రాష్ట్రల్లో నిర్వహించిన, నిర్వహిస్తున్న ఎలక్షన్ల వల్ల కూడా కోవిడ్ వ్యాప్తి జరుగుతుందన్నది జగమెరిగిన సత్యం.ఇదిలా ఉండగా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో కూడా ఎన్నికల జోరు సాగుతున్నది.

ఈ క్రమంలో ఇప్పటికే ఐదు విడతలు జరిగిన పోలింగ్ తాజాగా గురువారం ఆరో విడుత ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది.కాగా ఈ నెల 26న ఏడో విడుత, 29న ఎనిమిదో విడుత పోలింగ్‌ జరుగనుండగా, వచ్చే నెల 2న ఈ ఫలితాలను ఈసీ ప్రకటించనుంది.

ఇకపోతే ఆరో విడుత పోలింగ్‌లో కాంగ్రెస్‌ నుంచి 12 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, కూటమి నుంచి సీపీఐ (ఎం) 23 మంది అభ్యర్థులను బరిలో దింపింది.ఇక అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ 43 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

ఉత్తర దీనాజ్‌పూర్‌, నాడియా, ఉత్తర 24 పరగణాలు, పూర్బా బర్ధమాన్‌ నాలుగు జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు 10,897 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ పోలింగ్‌ జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube