తల్లిని కొడుతున్నాడని తండ్రిని చంపిన కూతురు!

Sixteen Year Old Girl Kills Father With Iron Rod Says He Thrashed Her Mother

క్షణికావేశం అనేక అనర్థాలకు దారి తీస్తుంది.అది ఎంతలా అంటే ఒక మనిషి తన జీవితకాలం కోలుకోలేనంతగా.

 Sixteen Year Old Girl Kills Father With Iron Rod Says He Thrashed Her Mother-TeluguStop.com

ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయాలు మన జీవితాన్నే తలకిందులుగా చేసేంతలా ఉంటాయి.ఇలా ఎందరో కొద్ది నిమిషాల్లో తీసుకున్న పొరపాటు నిర్ణయాల మూలంగా శిక్షలు అనుభవిస్తూనే ఉన్నారు.

ఇలానే ఓ బాలిక తప్పుడు నిర్ణయంతో తన తండ్రిని చంపింది.

 Sixteen Year Old Girl Kills Father With Iron Rod Says He Thrashed Her Mother-తల్లిని కొడుతున్నాడని తండ్రిని చంపిన కూతురు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మద్యానికి బానిసైన తండ్రి తన తల్లిని రోజూ కొడుతున్నాడనే కోపంతో కన్న తండ్రిని ఐరన్ రాడ్డుతో కొట్టి చంపిది ఓ కూతురు.

ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో వెలుగుచూసింది.కన్న తల్లిపై ప్రేమ పెంచుకున్న ఆ కూతురు తన తండ్రి అలా రోజూ మద్యం తాగి తల్లిని కొట్టడం చూసిన 16 ఏండ్ల కుమార్తె ఆవేశంతో ఐరన్ రాడ్డుతో తండ్రిని కొట్టింది.

దానితో తండ్రి అక్కడిక్కడే చనిపోయాడు.అనంతరం ఆ బాలిక పోలీసులకు ఫోన్ చేసి వారికి లొంగిపోయింది.

తండ్రి ఏ పనిచేయకుండా తన కొడుకుపై ఆధారపడుతూ అతని వద్ద డబ్బులు తీసుకుని జీవనం గడుపుతూ నిత్యం తాగుతూ తల్లిని కొడుతుండేవాడు.

తన పెద్దకుమారుడి పెళ్లి గురించి అందరూ మాట్లాడుతుండగా తండ్రి మద్యం తాగొచ్చి గొడవ చేస్తుండటంతో అది చూసిన కూతురు కోపంతో రగిలిపోయింది.

దాంతో ఆ ఆవేశంలో బాలిక తండ్రిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపిందని పోలీసులు తెలిపారు.పోలీసులు బాలికపై కేసు నమోదు చేసుకుని ఆమెను బాలికల సదనానికి తరలించినట్టు తెలిపారు.

తల్లిని రోజూ తాగి బాధపెడుతూ.కొడుతున్నాడని ఆ చిన్ని హృదయం తల్లడిల్లింది కాబోలు.

కాని కని పెంచిన తండ్రిని తన ఆవేశంతో ఏమి చేస్తున్నా అని కూడా ఆలోచనా శక్తి కోల్పోయింది ఆ అమ్మాయి.ఫలితం తన తండ్రిని చేతులారా చంపింది.

దాని ఫలితం శిక్షను అనుభవించడం… ఇకనైనా ఏదైనా చేసేటప్పుడు తప్పటడుగు వేయకుండా ఒక్క నిమిషం ఆలోచించండి.ప్రాణాలను నిలుపుకోండి.నిలబెట్టండి.

#SixteenIron #Iron Rod #Mother #Madhyapradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube