6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారట... సంచలన విషయాన్ని బయటకు చెప్పిన యంగ్‌ హీరో  

Six Years Love In Raj Tarun-raj Tarun,six Years Love,uyyala Jampala,vijayawada

ఉయ్యాల జంపాలా చిత్రంతో హీరోగా పరిచయం అయిన రాజ్‌ తరుణ్‌ రెండు మూడు సంవత్సరాలు జోరు చూపించాడు. ఈయన ఆడింది ఆటగా, చేసింది సక్సెస్‌ సినిమాగా నిలిచింది. వరుసగా విజయాలు రావడంతో రాజ్‌ తరుణ్‌ కాస్త ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో కథల ఎంపిక విషయంలో అజాగ్రత్త వహించాడు..

6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారట... సంచలన విషయాన్ని బయటకు చెప్పిన యంగ్‌ హీరో -Six Years Love In Raj Tarun

దాంతో ఫలితం తేడా కొట్టింది. గత రెండు సంవత్సరాలుగా మనోడికి అస్సలు టైం బాగా లేదు. ఇలాంటి సమయంలో ఒక్క సినిమా ఛాన్స్‌ ఈయనకు వచ్చిది.

ఈ సందర్బంగానే రాజ్‌ తరుణ్‌ ఆశ్చర్యకర విషయాన్ని చెప్పుకొచ్చాడు.

రాజ్‌ తరుణ్‌ తాజాగా ఒక ఆంగ్ల దిన పత్రికతో మాట్లాడుతూ. తాను ప్రేమలో ఉన్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజమే అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఆమె ఎవరు అనే విషయంపై మీడియాలో వస్తున్న కథనాలు అబద్దం అని పేర్కొన్నాడు. తాను ప్రేమిస్తున్న అమ్మాయి విజయవాడకు చెందిన ఒక వ్యాపారవేత్త.

ఆమెకు ఇబ్బంది కలుగకూడదు అనే ఉద్దేశ్యంతో తమ ప్రేమ విషయాన్ని ఇన్నాళ్లు బయటకు తెలియనివ్వలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

రాజ్‌ తరుణ్‌ ఇంకా తన ప్రేమ గురించి చెబుతూ… ఆరు సంవత్సరాల క్రితం వైజాగ్‌లో తన బర్త్‌డే వేడుకలో ఆమెను కలవడం జరిగింది. కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా పరిచయం అయిన ఆమె ప్రవర్తన మరియు ఆమె ఆలోచన తీరు నాకు బాగా నచ్చింది. నేను ఎలాగైతే అనుకుంటానో, ఆలోచిస్తానో అలాగే ఆమె ప్రవర్తించింది.

అందుకే ఆమెపై నాకు అభిమానం ఏర్పడింది. ఆమెకు కూడా నేనంటే ఇష్టం ఏర్పడింది. మా ఇద్దరి మద్య ప్రేమ చిగురించిందని చెప్పుకొచ్చాడు..

వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా రాజ్‌ తరుణ్‌ ప్రకటించాడు. హీరోగా ఇంకా సరిగా సెట్‌ అవ్వకుండానే పెళ్లి చేసుకోబోతున్న రాజ్‌ తరుణ్‌ భవిష్యత్తుపై ఆందోళన లేదంటున్నాడు.