గిన్నిస్ రికార్డు సాధించిన ఆరేళ్ల అహ్మదాబాద్ బాలుడు.. అసలు ఏం సృష్టించాడంటే..!

ఈ జనరేషన్ పిల్లలు చాలా చురుకుగా ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాం.అలాంటి వారికి వారి తల్లిదండ్రుల నుంచి మరింత ప్రోత్సాహం ఇస్తే వారు ఎన్ని విజయాలు సాధించగలరని ఇప్పటికే చాలా మందిని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

 6-year-old Ahmedabad Boy Enters Guinness World Record,  Python Programming, Pyth-TeluguStop.com

అలాంటి వరుసలో నిలబడే ఆరేళ్ల పిల్లవాడు గుజరాత్ రాష్ట్రానికి చెందిన అర్హం ఓం తల్సానియా.రాష్ట్రానికి చెందిన అహ్మదాబాద్ నగరంలో ఉన్న ఓం తల్సానియా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కొడుకే అర్హం తల్సానియా.

ఆ అబ్బాయికి కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే.ఆ పిల్లోడు కోడింగ్ నేర్చుకోవడానికి ఉన్న ఆసక్తి గమనించి అతనికి తన తండ్రి పైథాన్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ ను నేర్పించాడు.

ఇంకేముంది అతి పిన్న వయస్కుడైన కంప్యూటర్ ప్రోగ్రామర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కాడు.

గిన్నిస్ వరల్డ్ లో స్థానం దక్కడం పై ఆ బాలుడు మాట్లాడుతూ.

తన తండ్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తుండడంతో తనకి కోడింగ్ పై ఇష్టం పెరిగిందని తన తండ్రి కోడింగ్ నేర్పించారని తెలిపాడు.తాను రెండు సంవత్సరాల వయసులోనే టాబ్లెట్లను వాడటం అలాగే, మూడు సంవత్సరాల వయసులోనే ఐఓఎస్, విండోస్ లాంటి గ్యాడ్జెట్స్ ఉపయోగించడం చేశానని తెలిపాడు.

తన తండ్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పైథాన్ ప్రోగ్రామ్ పై పని చేస్తున్న నేపథ్యంలో తనకు పైథాన్ ప్రోగ్రాం పై ఇంట్రెస్ట్ కలగడంతో తన తండ్రి దగ్గర నుండి పైథాన్ ప్రోగ్రాం పై బేసిక్స్ నేర్చుకున్నాను అని తెలిపాడు.అది తనకి చాలా బాగా ఉపయోగపడిందని దానికి కారణం పైథాన్ ప్రోగ్రాం నేర్చుకోవడం ద్వారా తానే స్వయంగా ఓ చిన్న ఆన్లైన్ గేమ్ తాయారు చేసాడని తెలిపాడు.

అయితే వీటిని తాను గిన్నిస్ బుక్ కమిటీకి పంపగా వారు నేనే ప్రోగ్రాం చేశానని రుజువులు పంపమని అడిగారు.దీంతో కొన్ని రోజుల తర్వాత ఆ గేమ్ తానే డిజైన్ చేసినట్లు నిరూపించుకున్న తర్వాతనే తనకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందానని తెలిపాడు.

ఇకపోతే భవిష్యత్తులో మరిన్ని గేమ్స్ కొత్త ఆప్స్ రూపొందించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.ఇక తన తండ్రి ఓం తల్సానియా మాట్లాడుతూ.

తన కుమారుడు చిన్నతనంలోనే కోడింగ్ పట్ల ఆసక్తి ఎక్కువగా చూపడంతో తనకి బేసిక్స్ నేర్పించాలని అతనికి తద్వారా స్వయంగా చిన్నచిన్న గేమ్స్ రూపొందించినట్లు తెలిపాడు.అంతేకాదు ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ పరీక్షను కూడా క్లియర్ చేయడంతో గిన్నిస్ బుక్ రికార్డును సాధించినట్లు తెలిపారు.

దీంతో ప్రపంచంలోనే అతి చిన్న వయస్కుడిగా కంప్యూటర్ ప్రోగ్రామర్ గా నిలిచాడు.తాను గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకోవడం తో తనకు ఎంతో సంతోషంగా ఉందని తండ్రి తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube