రూట్ మార్చిన అవికా ఏకంగా అరడజను సినిమాలతో ఫుల్ బిజీ

చిన్నారి పెళ్ళికూతురు డబ్బింగ్ సీరియల్ తో తెలుగువారికి సుపరిచితం అయిన హిందీ నటి అవికాగోర్ ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది.మొదటి సినిమాతో హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చింది తరువాత సినిమా చూపిస్తా మామ అంటూ మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకొని క్రేజీ హీరోయిన్ గా అందరి దృష్టిని ఆకర్షించింది.

 Six Telugu Movies In Avika Gor Hand-TeluguStop.com

ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా యంగ్ హీరోలతో వరుస అవకాశాలు సొంతం చేసుకుంది.అయితే ఈ జర్నీలో కాస్తా బొద్దుగా మారడంతో ఈ అమ్మడిని అవకాశాలు తగ్గిపోయాయి.

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా తర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకొని కంప్లీట్ గా లుక్ మార్చేసి మళ్ళీ టాలీవుడ్ లో అడుగుపెట్టింది.

 Six Telugu Movies In Avika Gor Hand-రూట్ మార్చిన అవికా ఏకంగా అరడజను సినిమాలతో ఫుల్ బిజీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Adi Saikumar, Amaran Movie, Avika Gor, Thank You Movie, Tollywood-Movie

ఈ సారి కాస్తా హాట్ అండ్ గ్లామర్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంది.దీంతో వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ థాంక్యూ మూవీతో అవికా గోర్ కీలక పాత్రలో నటిస్తుంది.

కళ్యాణ్ దేవ్ నెక్ట్మ మూవీలో హీరోయిన్ గా ఖరారైంది.అలాగే ఆది సాయికుమార్ కి జోడీగా అమరన్ అనే మూవీలో హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది.

వీటితో పాటు సొంతగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా రెండు చిన్న సినిమాలు కూడా చేస్తుంది.వీటితో పాటు ఓ యంగ్ హీరోతో కూడా అవికాగోర్ హీరోయిన్ గా నటించబోతుందని తెలుస్తుంది.

ఇలా ప్రస్తుతం అవికాగోర్ చేతిలో అరడజను సినిమాల వరకు లైన్ లో ఉన్నాయి.వీటిలో మంచి బజ్ ఉన్న సినిమాలు కూడా ఉండటంతో ఒక్క బ్రేక్ వస్తే ఈ బ్యూటీ టాలీవుడ్ లో యంగ్ హీరోల ఛాయస్ గా మారిపోయే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.

#Adi Saikumar #Avika Gor #Thank You Movie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు