సుప్రీం లో స్వైన్ ఫ్లూ కలకలం,ఏకంగా ఆరుగురు న్యాయమూర్తులకు

ఒకపక్క కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు వణికిపోతుండగా,తాజాగా భారత్ లో ఈ స్వైన్ ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి.భారత్ లోని కొన్ని చోట్ల ఈ స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి.

 Six Supreme Court Judges Down With Swine Flu-TeluguStop.com

అయితే తాజాగా ఈ స్వైన్ ఫ్లూ సుప్రీం కోర్టుకు కూడా పాకింది.ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఈ స్వైన్ ఫ్లూ సోకినట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా పలువురు లాయర్లు కూడా ఈ స్వైన్ ఫ్లూ తో బాధపడుతున్నట్లు సమాచారం.దీనితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటుచేయనున్నట్టు జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రకటించారు.

ఈ స్వైన్ ఫ్లూ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది.కోర్టులోని ఆరుగురు న్యాయమూర్తులు పలువురు లాయర్లు హెచ్1ఎన్1 వైరస్ తో బాధపడుతున్నారని జస్టిస్ డివై చంద్రచూడ్ వెల్లడించారు.

అయితే ఈ స్వైన్ ఫ్లూ ఇతరులకు పాకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.అలానే న్యాయవాదులకు టీకాలు వేసేందుకు వ్యాక్సిన్ లను కూడా అందుబాటులో ఉంచాలి అంటూ ఆయన కోరారు.

మరోపక్క ఈ స్వైన్ ఫ్లూ కారణంగా న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా మాస్క్ పెట్టుకొని మరి కోర్టుకు హాజరైనట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం సుప్రీం లో న్యాయమూర్తులు,న్యాయవాదులకుఈ స్వైన్ ఫ్లూ సోకడం తో ఆందోళన చెందుతున్నారు.

స్వైన్ ఫ్లూ అంటే పందులలో వచ్చే శ్వాసకోశ వ్యాధి.అయితే ఇది ఒకరినుంచి మరొకరి సోకుతుంది కాబట్టే ఈ వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీం భావిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube