ఈ 6 మంత్రాలు య‌మ ప‌వ‌ర్ ఫుల్... వీటిని పటిస్తే ఆయుష్షు, ధ‌నం, శ‌క్తి మీ వెంటే .!  

Six Powerful Hindu Mantras -

అనేక మంది దేవుళ్లు, దేవతలను పూజించేందుకు హిందువులు పలు విధానాలను పాటిస్తుంటారు.కొందరికి కొన్ని రకాల నైవేద్యాలు, పువ్వులు సమర్పిస్తే కొందరు దేవుళ్లకు ఇతర నైవేద్యాలు, పూలు సమర్పించాల్సి ఉంటుంది.

ఒక్కో దేవున్ని, దేవతను భిన్న రకాల పూలు, నైవేద్యాలతో భక్తులు కొలుస్తారు.ఇలా చేస్తే ఆ దేవుళ్లు, దేవతల ఆశీస్సులు లభిస్తాయని, ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్ముతారు.

ఈ 6 మంత్రాలు య‌మ ప‌వ‌ర్ ఫుల్… వీటిని పటిస్తే ఆయుష్షు, ధ‌నం, శ‌క్తి మీ వెంటే .-Telugu Bhakthi-Telugu Tollywood Photo Image

అయితే నైవేద్యాలు, పూలతో పాటు కింద ఇచ్చిన పలు మంత్రాలను కూడా తమకు కావల్సిన కోరికలకు అనుగుణంగా భక్తులు పఠిస్తే దాంతో ఆశించిన ఫలితాలు కలుగుతాయి.మరి ఆ మంత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.!

1.గాయత్రి మంత్రం


ఓం భూర్ భువః స్వాహా తత్సవితుర్ వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

ఈ మంత్రాన్ని పఠిస్తే జ్ఞానం వస్తుంది.

మానసికంగా, శారీరకంగా శక్తి లభిస్తుంది.తెలివితేటలు కలుగుతాయి.చదువుల్లో రాణిస్తారు.విద్యా పారంగతులు అవుతారు.

విద్య బాగా వస్తుంది.

2.మహామృత్యుంజయ మంత్రం


ఓం త్రయంబకం యజామహే
సుగంధి పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బంధనాన
మృత్యోర్ముక్షీయ మామృతాత్

ఈ మంత్రం పఠిస్తే మృత్యువు మీ దరి చేరదు.ఆయుష్షు వృద్ధి చెందుతుంది.

3.శ్రీ గణేష మంత్రం


శ్రీ వక్రతుండాయ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం
కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా

ఈ మంత్రం పఠిస్తే పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి.ఎలాంటి అవరోధాలు ఎదురు కావు.జీవితం సుఖంగా సాగుతుంది.

4.సరస్వతి స్తోత్రం


యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్ర్తావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైః సదా పూజితా
సా మాం పాతు సరస్వతి భగవతి నిఃశేషజాడ్యాపహా

ఈ మంత్రాన్ని విద్యార్థులు పఠిస్తే జ్ఞానం బాగా వస్తుంది.చదువుల్లో రాణిస్తారు.తెలివి తేటలు పెరుగుతాయి.ఏ అంశంలోనైనా నిపుణత సాధిస్తారు.

5.లక్ష్మీ స్తోత్రం


అంగ్గం హరేః పులకభూషణమాశ్రయంతి
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమం
అంగీకృతాఖినవిభూతిరపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః

ఈ మంత్రాన్ని పఠిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.ధనం కలుగుతుంది.

6.లక్ష్మీ స్తుతి


నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే

ఈ మంత్రాన్ని పఠిస్తే సమస్యలన్నీ తొలగిపోయి జీవితం సాఫీగా సాగుతుంది.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Six Powerful Hindu Mantras Related Telugu News,Photos/Pics,Images..

TELUGU BHAKTHI

footer-test