ఎన్నికల రోజు ఆరు సినిమాలు ఏంటీ బాబులు?   Six Movie Releases On December 7th Telangana Elections Day     2018-11-30   11:32:13  IST  Ramesh P

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందడి కొనసాగుతున్న విషయం తెల్సిందే. డిసెంబర్‌ 7వ తారీకున ఎన్నికలు జరుగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్దం అయ్యారు. ఇక ఎన్నికల రోజున ప్రతి ఒక్క విద్యా, వ్యాపార సంస్థలు బంద్‌ చేయాల్సిందే అంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అన్ని బంద్‌ చేయాలని చెప్పిన ఎన్నికల సంఘం వారు సినిమా హాల్స్‌ను బంద్‌ చేయమని కూడా చెప్తే బాగుండేది. థియేటర్ల గురించి ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదు.

డిసెంబర్‌ 7వ తారీకు శుక్రవారం అదీ కాకుండా సెలవు అవ్వడంతో ఆ రోజున ఏకంగా ఆరు సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఎన్నికల రోజు అయినా కూడా నాకేంటి అనుకుంటూ సినిమాలు ముందుకు వస్తున్నాయి. ఆ రోజు వస్తున్న చిత్రాల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ చిత్రాలు బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ జంటగా తెరకెక్కిన ‘కవచం’ మరియు వర్మ నిర్మాణంలో తెరకెక్కిన ‘భైరవ గీత’. ఈ రెండు సినిమాలతో పాటు సుమంత్‌ సుబ్రమణ్యపురం, హుషారు, నెక్ట్స్‌ ఏంటీ చిత్రాలు కూడా విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

Six Movie Releases On December 7th Telangana Elections Day-December Kavacahm Six Day

తెలంగాణలో ఎన్నికు ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదని, ఆ రోజు తెలంగాణలో యావరేజ్‌ కలెక్షన్స్‌ నమోదు అయినా ఏపీలో మంచి వసూళ్లు నమోదు అవుతాయని అంతా భావిస్తున్నారు. ఇక శని, ఆదివారాల్లో తెలంగాణలో కూడా సందడి చేయవచ్చు అని సదరు మేకర్స్‌ అంటున్నారు. డిసెంబర్‌ 7 మిస్‌ అయ్యిందంటే ఆ తర్వాత పెద్ద సినిమాలు బాక్సాఫీస్‌ ముందు క్యూ కడుతున్నాయి. సంక్రాంతి వరకు ఏదో ఒక సినిమా వస్తూనే ఉన్నాయి. అందుకే చిన్న చితక చిత్రాలన్నీ కూడా డిసెంబర్‌ 7ని టార్గెట్‌ చేశాయి. ఆ చిత్రాలకు ఎన్నికలు అడ్డు కావు అంటున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.