విశాఖలో కాల్పులు ఆరుగురు మావోయిస్టుల మృతి..!!

విశాఖపట్టణం జిల్లా కొయ్యూరు మండలం ఏజెన్సీ ఏరియా లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.మంప పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో గ్రేహౌండ్స్ ద‌ళాలు, మావోయిస్టుల‌కు మధ్య భీకరమైన కాల్పులు జరగటంతో మావోయిస్టులు ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.

 Six Maoists Killed In Visakhapatnam Firing-TeluguStop.com

మావోయిస్టులు ఉన్నట్లు పక్కా సమాచారం పోలీసులకు తెలియడంతో కూంబింగ్ నిర్వహించడానికి పోలీసులు రంగంలోకి దిగారు.దీంతో ఈ రోజు ఉదయాన్నే తెల్లవారుజామున మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

దట్టమైన అడవి ప్రాంతం కావడంతో జరిగిన కాల్పుల్లో ఎంతమంది చనిపోయారు ఎవరు చనిపోయారు అన్న దాన్ని వివరాలు పూర్తిగా తెలియటానికి ఇంకా టైం పడుతుంది అని కొయ్యూరు సీఐ చెప్పుకొచ్చారు.చాలా మంది మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్లు దీంతో ఇంకా కూంబింగ్ కొన‌సాగుతోంద‌ని చెప్పారు.

 Six Maoists Killed In Visakhapatnam Firing-విశాఖలో కాల్పులు ఆరుగురు మావోయిస్టుల మృతి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే క్రమంలో మావోయిస్టు అగ్ర నేతలను పట్టుకోవడానికి ఇంకా అదనపు బలగాలను తరలించినట్లు ఘటన ప్రాంతంలో ఏకే-47 తుపాకులు లభ్యమయ్యాయని చెప్పుకొచ్చారు. 

.

#Agency Area #Ak 47 Rifles #Maoists #Visakhapatnam #MaoistsTop

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు