దారుణం : ఒక్క ఏనుగుకు సాయం చేసే క్రమంలో 6 ఏనుగులు మృతి

చిన్న పిల్లలు నీటిలో పడ్డ సమయంలో ఒకరికి సాయం చేసుకునేందుకు మరొకరు నీటిలో పడ్డట్లుగా మనం గతంలో వార్తల్లో చూశాం.ఒక్కరు నీటిలో పడటంతో పలువురు నీటిలో కొట్టుకు పోయిన సంఘటన మర్చి పోలేం.

 Six Elephants Die Trying To Save Each Other At Thai Waterfal-TeluguStop.com

అలాంటి సంఘటన ఇప్పుడు థాయిలాండ్‌లో జరిగింది.అయితే పిల్లల విషయంలో కాకుండా ఏనుగుల విషయంలో ఈ సంఘటన జరిగింది.

మంచి తనంకు మారు పేరుగా ఏనుగులు నిలుస్తాయి.ముఖ్యంగా తమ జాతికి ఏదైనా ఆపద అంటే లేదంటే ఏదైనా ఇబ్బంది అంటే అన్ని ఏనుగులు కూడా ఏకం అవుతాయి.

ఈ విషయాన్ని మనం చాలా సార్లు చూశాం.

ఒక్క ఏనుగుపై ఏదైనా దాడి చేస్తే ఇతర ఏనుగులు ప్రతిఘటిస్తాయి.

అలాగే ఒక ఏనుగు ఆపదలో ఉన్నాయంటే అన్ని ఏనుగులు కూడా సాయం చేసేందుకు ముందుకు వస్తాయి.ఇటీవల థాయిలాండ్‌లోని ఒక జూ లో అందరు చూస్తుండగా ఒక ఏనుగుకు సాయం చేసే క్రమంలో ఏకంగా ఆరు ఏనుగులు నీటి గుంటలో పడి మృతి చెందాయి.

ఆ ఏనుగులను రక్షించేందుకు జూ సిబ్బంది చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో ఒక్కదాని కోసం మొత్తం ఆరు ఏనుగులు నీట మునిగి పోయాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఆ జ్యూలో ఒక పెద్ద సరస్సు వంటిది ఉంది.అందులో జంతువులు నీళ్లు తాగుతూ ఉంటాయి.

ఒక చిన్న ఏనుగు ఆ నీటి లోనికి వెళ్లి వచ్చేందుకు ప్రయత్నించింది.కాని అప్పటికి కాస్త ఎక్కువ లోతుకు వెళ్లడంతో బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది.

బయటకు వచ్చేందుకు ఎంతగా ప్రయత్నించినా కూడా ఆ చిన్న ఏనుగు బయటకు రాలేక పోయింది.ఆ విషయం గుర్తించిన తోటి ఏనుగులు వెంటనే దాన్ని కాపాడేందుకు ప్రయత్నించాయి.

మొదట ఒక ఏనుగు ఆ చిన్న ఏనుగును రక్షించేందుకు వెళ్లింది.ఆ ఏనుగు కూడా అందులో ఇరుక్కు పోయింది.

Telugu Baby Elephant, Khaoyai, Thai Waterfal, Thailand-

 

ఆ తర్వాత రెండు ఏనుగులను కాపాడేందుకు వెళ్లిన మూడవ ఏనుగు కూడా అందులోనే చిక్కుకు పోయింది.ఇందతా కూడా జనాలు చూస్తూనే ఉన్నారు.జూ సిబ్బంది ఇతర ఏనుగులను అందులోకి వెళ్లకంఉడా ఆపడంలో విఫలం అయ్యారు.మరో రెండు ఏనుగులు కూడా వెళ్లడంతో మొత్తం ఆరు ఏనుగులు కూడా నీటిలో చిక్కుకుని దాదాపు గంట పాటు విలవిలాడి చనిపోయాయి.

జూ సిబ్బంది క్రేన్‌లను రప్పించేప్పటికి అప్పటికే నష్టం జరిగి పోయింది.ఏం చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది.ఒక్క ఏనుగు కోసం మరో అయిదు ఏనుగులు మృతి చెందడం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జంతు ప్రేమికులను బాధకు గురి చేస్తోంది.జంతువుల్లో మంచి తనంకు ఇది పరాకాష్ట అంటూ జనాలు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube