రామాయణంలో 'రావణుడికి' ఎప్పుడు ఉండే 6 కోరికలు ఇవే..! సీతను పొందటం ఒక్కటే కాదు.!

రామాయణంలో రావణుడు ఎంత పవర్‌ఫుల్ విలనో అందరికీ తెలిసిందే.సీతను అపహరించుకుపోయి ఆమెను అనుభవించాలని సూచిస్తాడు.

 Six Desires Of Ravana Which Will Stun You , Six Desires, Ravana,  Ramayana, Seet-TeluguStop.com

కానీ అందుకు ఆమె అంగీకరించదు.దీంతో రావణుడు ఆమె అంగీకరం కోసం ఎదురు చూస్తాడు, కానీ ఆమెను బలవంతంగా ముట్టుకోడు కూడా.

ఈ క్రమంలో రాముడు వానర సైన్యంతో వచ్చి రావణున్ని సంహరించి సీతను తీసుకెళ్తాడు.ఈ కథ అందరికీ తెలిసిందే.

అయితే రావణుడు నిజానికి రాక్షసుడే అయినా అతను తన రాజ్యంలో ప్రజలను మాత్రం బాగా చూసుకునేవాడట.అందులో భాగంగానే ప్రజల కోసం పలు మంచి పనులు జరిగితే బాగుండు అని ఎప్పుడూ కోరుకునే వాడట.

మరి రావణుడు తాను జరగాలని ఎప్పటికీ కోరుకున్న ఆ పనులు, అతనిలో ఉన్న కోరికలు ఏమిటో తెలుసా.?.

1.సముద్రంలోని నీరు ఉప్పగా ఉంటుందని అందరికీ తెలుసు.అయితే దాన్ని తాగేందుకు అనువుగా దేవుడు మారిస్తే బాగుండు అని రావణుడు కోరుకునేవాడట.

2.ఇక తన రాజ్యంలో రైతులు ఒక్కోసారి వర్షాలు పడక పంటలు పండించలేకపోయేవారట.దీంతో రావణుడు ఏం కోరుకునేవాడంటే.ఇంద్రుడికి పూజిస్తే ఆయన వర్షాలను కురిపిస్తాడు కదా, అలా పూజలు చేస్తే ఇంద్రుడు అందుకు స్పందిస్తే బాగుండును అని అనుకునేవాడట.

3.తన దేహం బంగారం వాసన వస్తే బాగుండును అని రావణుడు అనుకునేవాడట.అదేవిధంగా తండ్రి బతికి ఉన్నంత వరకు అతని కుమారులు చనిపోకూడదని కూడా అనుకునేవాడట.

4.మద్యం అంటే చాలా మందికి ఇష్టం కనుక, దానికి వాసన లేకుండా ఉంటే బాగుంటుంది అని రావణుడు భావించేవాడట.

5.భూమికి స్వర్గానికి మధ్య నిచ్చెన వేస్తే అందులో నుంచి మనుషులు నడిచి వెళ్తారు కదా అని రావణుడు కోరుకునేవాడట.

6.మానవుల రక్తానికి రంగు లేకుండా ఉంటే బాగుంటుందని, మనుషులందరూ సమానమే అని సూచించేలా అందరూ తెల్లగా ఉంటే బాగుంటుందని కూడా రావణుడు అనుకునేవాడట.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube