టెక్సాస్‌లో బీభత్సం: ఒకదానికొకటి ఢీకొట్టుకున్న 130 వాహనాలు.. ఆరుగురి మృతి

భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత ఆదివారం మంచు చరియలు విరిగిపడి ధౌలీగంగా నది ఉప్పొంగిన సంగతి తెలిసిందే.ఈ మెరుపు వరదల్లో సుమారు 172 మంది గల్లంతవ్వగా.

 At Least 6 Dead In Massive Crash Involving More Than 130 Vehicles In Texas, 130-TeluguStop.com

భారీగా ఆస్తి నష్టం సంభవించింది.ఇదే సమయంలో ప్రస్తుతం అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది.

తీవ్రమైన మంచు తుపాను కారణంగా రోడ్డుపై పట్టుకోల్పోయిన 130కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతిచెందగా.70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.స్థానిక కాలమానం ప్రకారం.

గురువారం తెల్లవారుజామున 6 గంటలకు డల్లాస్‌-ఫోర్ట్‌వర్త్‌ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.

తొలుత ఫెడ్‌ఎక్స్‌ ట్రక్కు అదుపు తప్పి బారియర్‌ను ఢీకొట్టి అకస్మాత్తుగా నిలిచిపోయింది.

దీంతో వెనుకాలే వస్తున్న పలు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి.అప్పటికీ భారీ వేగంతో వుండటంతో అవి ఒకదాని కిందకొకటి దూసుకెళ్లాయి.

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు.

వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.గాయపడిన వారిలో ఆరోగ్య కార్యకర్తలు, అత్యవసర సర్వీసుల సిబ్బంది వున్నారు.

వాహనాలు ఒకదానిలో ఒకటి ఇరుక్కుపోవడంతో ఇంకా పలువురు చిక్కుకుపోయారు.వారిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది యత్నిస్తున్నారు.

అయితే క్షతగాత్రులు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.ఈ ప్రమాదం కారణంగా డల్లాస్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించాయి.

తీవ్ర మంచు తుఫాను కారణంగా వాహనాలు పట్టుకోల్పోడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఫోర్ట్‌వర్త్‌ పోలీస్‌ అధికారి డేనియల్‌ తెలిపారు.మంచు తుఫాను కారణంగా టెక్సాస్‌ రాష్ట్రంలోని షెర్లీ, డల్లాస్‌లలో ముగ్గురు చొప్పు మృతి చెందారు.

కెంటకీ, వర్జీనియా రాష్ట్రాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube