బిగ్‌ బ్రేకింగ్‌ : రాజశేఖర్‌కు యాక్సిడెంట్‌, ఆయన కూతురు శివాత్మిక ఏమన్నదంటే  

Sivathmikha Comments On Her Father Rajashekar-sivathmikha,tollywood

యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్‌ కొన్ని నెలల క్రితం చిన్న యాక్సిడెంట్‌ చేయడంతో పెద్ద వివాదం అయిన విషయం తెల్సిందే.డిప్రెషన్‌లో ఉన్న రాజశేఖర్‌ యాక్సిడెంట్‌ చేశాడంటూ అప్పుడు వార్తలు వచ్చాయి.ఆ వివాదం మెల్ల మెల్లగా ముగుస్తున్న ఈ సమయంలో అనూహ్యంగా రాజశేఖర్‌కు మరో పెద్ద యాక్సిడెంట్‌ అయ్యిందట.గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఔటర్‌ రింగ్‌ రోడ్డుపైనే యాక్సిడెంట్‌ అయినట్లుగా సమాచారం అందుతోంది.

Sivathmikha Comments On Her Father Rajashekar-sivathmikha,tollywood Telugu Tollywood Movie Cinema Film Latest News Sivathmikha Comments On Her Father Rajashekar-sivathmikha Tollywood-Sivathmikha Comments On Her Father Rajashekar-Sivathmikha Tollywood

రాజశేఖర్‌ యాక్సిడెంట్‌ వార్తలను మొదట ఎవరు నమ్మలేదు.కాని అనూహ్యంగా మీడియాలో విజువల్స్‌ రావడంతో నమ్మాల్సి వచ్చింది.ఆ తర్వాత రాజశేఖర్‌ చిన్న కూతురు శివాత్మిక కూడా ఈ విషయమై స్పందించింది.నాన్నగారికి బాగానే ఉంది.

ఆయన చిన్న చిన్న గాయాలతో బయట పడ్డాడు.యాక్సిడెంట్‌ జరిగిన విషయం నిజమే కాని ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు అంటూ ఆమె ట్వీట్‌ చేసింది.యాంగ్రీ యంగ్‌మన్‌ అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో శివాత్మిక ఈ ప్రకటన చేసింది.

కారులో రాజశేఖర్‌ మరియు మరో వ్యక్తి ఉన్నాడట.ఇద్దరు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌కు వెళ్తున్నారని సమాచారం అందుతోంది.

ఆ ఇద్దరు కూడా కారులో ప్రయాణిస్తున్న సమయంలో కారు అదుపు తప్పింది.ఆ సమయంలో కారు మూడు ఫల్టీలను కొట్టినట్లుగా తెలుస్తోంది.అయితే వెంటనే ఎయిర్‌ బెలూన్స్‌ ఓపెన్‌ అవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయ్యింది.సీటు బెట్టు పెట్టుకుని ఉండటంతో పాటు ఎయిర్‌ బెలూన్స్‌ ఓపెన్‌ అవ్వడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని సినీ వర్గాల వారు అంటున్నారు.