పుష్ప సినిమాలో జగపతి బాబు చెల్లి నటిస్తోందట.. నిజమేనా..?

చలన చిత్ర పరిశ్రమలో వచ్చీరావడంతోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత పెళ్లి చేసుకోగానే సినిమా పరిశ్రమకు దూరమైన నటీనటులు చాలామందే ఉన్నారు.అయితే ఇందులో ప్రముఖ హీరో జగపతి బాబు హీరోగా నటించిన “శివరామరాజు” చిత్రంలో ముగ్గురు అన్నదమ్ములు “ముద్దుల చెల్లి” గా నటించి తన సెంటిమెంటల్ మరియు ఎమోషనల్ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నటి మౌనిక గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

 Sivaramaraju Movie Fame Mounika Playing Priority Role In Pushpa Movie-TeluguStop.com

కాగా నటి మౌనిక తెలుగు, తమిళం, మలయాళం, తదితర భాషలలో దాదాపుగా 50 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.కాగా ఆ మధ్య ముస్లిం మతానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్తని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాకుండా తన మతాన్ని కూడా మార్చుకుంది.

దీంతో అప్పటి నుంచి సినిమా పరిశ్రమకి కొంతమేర దూరంగా ఉంటోంది.

 Sivaramaraju Movie Fame Mounika Playing Priority Role In Pushpa Movie-పుష్ప సినిమాలో జగపతి బాబు చెల్లి నటిస్తోందట.. నిజమేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా తాజాగా నటి మౌనిక గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ప్రస్తుతం తెలుగులో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో నటి మౌనిక ఓ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్ర లో నటిస్తున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అంతేకాక ఈ పాత్ర కోసం నటి మౌనిక దాదాపుగా ఇరవై లక్షల రూపాయలకు పైగా పారితోషికం కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.కానీ ఇప్పటి వరకు ఈ విషయంపై ఇటు మౌనిక గాని అటు చిత్ర యూనిట్ సభ్యులు గానీ స్పందించలేదు.

దీంతో పుష్ప చిత్రంలో మౌనిక నటిస్తుందనే విషయంపై వినిపిస్తున్న వార్తలలో నిజమెంతుందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Telugu Mounika, Pushpa Movie, Sivaramaraju Movie, Sivaramaraju Movie Fame Mounika Playing Priority Role In Pushpa Movie, Sukumar, Tollywood-Movie

ఈ విషయం ఇలా ఉండగా ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి జోడిగా కన్నడ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే కోలీవుడ్ ప్రముఖ హీరో ఫహద్ పైజల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.ఆ మధ్య ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది.

కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు దాదాపుగా 60 శాతం పైగా పూర్తైనట్లు సమాచారం.

#Sivaramaraju #Pushpa #Sukumar #Mounika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు