పవన్ సినిమాలో తమిళ హీరో.. ఎవరో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ వరుసగా సినిమాలను క్యూలో పెడుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్న పవన్, ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

 Sivakarthikeyan, Pawan Kalyan, Krish, Pspk27-TeluguStop.com

కాగా తన నెక్ట్స్ మూవీని కూడా పవన్ ఇప్పటికే ప్రారంభించాడు.స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను అతి త్వరలో మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

విరూపాక్ష అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో నటించనున్నాడు.ఇక ఈ సినిమాలో పవన్‌తో పాటు మరో యంగ్ హీరో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట.తమిళంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, తెలుగులో రెమో సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.

మరి పవన్ లాంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం అంటే నిజంగా అదృష్టమనే చెప్పాలి.

మరి ఈ సినిమాలో శివకార్తికేయన్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ ఎవరనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube