పవన్ సినిమా న్యూస్ కూడా ఫేక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్ సాబ్‌గా తెరకెక్కి్స్తున్నాడు.ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకోవడానికి పవన్ ప్లాన్ చేస్తున్నాడు.

 Sivakarthikeyan, Pawan Kalyan, Krish, Telugu Movie News-TeluguStop.com

కాగా ఈ సినిమా తరువాత పవన్ తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.
ఇప్పటికే స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ చిత్రాన్ని ఓకే చేసిన పవన్, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమాలో పవన్‌తో పాటు ఓ తమిళ యంగ్ హీరో నటిస్తున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.తమిళ హీరో శివకార్తికేయన్ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు రాగా, వాటిలో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమాలో శివకార్తికేయన్ నటించడం లేదట.

దీంతో ఈ సినిమాపై వస్తున్న గాలి వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది.

ఇక విరూపాక్ష అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube