భార్యకు కన్నీటితో థ్యాంక్స్ చెప్పిన శివ కార్తికేయన్.. ఏమైందంటే..?

కెరీర్ తొలినాళ్లలో సహాయ పాత్రల్లో నటించి శివ కార్తికేయన్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.తమిళ సినిమాలలో శివ కార్తికేయన్ ఎక్కువగా నటించగా అతను టీవీ యాంకర్ గా కూడా పని చేశారు.

 Siva Karthikeyan Blessed Second Child Shared Emotional Message, Siva Karthikeyan-TeluguStop.com

మెరీనా అనే సినిమాతో శివ కార్తికేయన్ నటుడిగా పరిచయం కాగా రెమో సినిమాతో శివ కార్తికేయన్ తెలుగులో కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.తాజాగా శివ కార్తికేయన్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు.

శివ కార్తికేయన్ రెండోసారి తండ్రి కాగా అతని భార్య మగబిడ్డకు జన్మనిచ్చారు.సోషల్ మీడియాలో శివ కార్తికేయన్ 18 సంవత్సరాల తర్వాత మా నాన్న తన చేయి పట్టుకున్నాడని పేర్కొన్నారు.

కొడుకు రూపంలో చనిపోయిన తండ్రి మళ్లీ పుట్టాడని శివ కార్తికేయన్ భావిస్తున్నారు.తండ్రి చనిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి తాను ఆ బాధను మోస్తున్నానని శివ కార్తికేయన్ అన్నారు.

తన భార్య చాలా సంవత్సరాల తర్వాత కొడుకుకు జన్మనివ్వడం ద్వారా ఆ బాధను పోగొట్టిందని వెల్లడించారు.కన్నీటితో తన భార్యకు కృతజ్ఞతలు చెబుతున్నానని శివ కార్తికేయన్ పేర్కొన్నారు. తల్లీబిడ్డ ఆస్పత్రిలో క్షేమంగా ఉన్నారని శివ కార్తికేయన్ వెల్లడించడం గమనార్హం.ఒకవైపు తండ్రి ఫోటోను ఉంచి మరోవైపు అప్పుడే పుట్టిన బాబు చేతిని పట్టుకుని శివ కార్తికేయన్ ఫోటోను షేర్ చేశారు.

శివ కార్తికేయన్ కు కొడుకు పుట్టడంతో కుట్టి శివకార్తికేయన్ పుట్టాడని శివకార్తికేయన్ ఫ్యాన్స్ చెబుతున్నారు.2013 సంవత్సరంలో శివకార్తికేయన్ దంపతులకు ఆర్తి అనే బిడ్డ పుట్టగా దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈ దంపతులకు మగబిడ్డ పుట్టారు.ప్రస్తుతం శివకార్తికేయన్ డాన్ అనే సినిమాలో నటిస్తుండటం గమనార్హం.శివ కార్తికేయన్ నటించిన డాక్టర్ అనే సినిమా త్వరలోనే రిలీజ్ కావాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube