'మా' వివాదం... ఓడినా కూడా బాధ్యతల నుండి తప్పుకోనంటున్న శివాజీ రాజా

ఇటీవలే తెలుగు సినిమా పరిశ్రమ నటీనటుల సంఘం ‘మా’ ఎన్నికలు పూర్తి అయ్యాయి.ఎన్నికల్లో ప్రసుత్త అధ్యక్షుడు శివాజీ రాజా ఓడిపోయి, కొత్తగా నరేష్‌ అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు.

 Sivaji Raja Want To Continue His Authority On Maa Association-TeluguStop.com

ఎన్నికల్లో గెలిచిన వెంటనే నరేష్‌ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్దం అయ్యాడు.కాని నరేష్‌ కు శివాజీ రాజా మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేశాడు.

నరేష్‌ ఎప్పుడెప్పుడు అధ్యక్ష పీఠంలో కూర్చోవాలా అంటూ ఎదురు చూస్తున్న సమయంలో శివాజీ రాజా మాత్రం ఆ పీఠం నుండి దిగను అంటూ తేల్చి చెబుతున్నాడు.ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా ఇలాంటి పిచ్చి ప్రకటనలు ఏంటీ అంటూ శివాజీ రాజాపై సినీ వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాసరు.

శివాజీ రాజా వాదన మరోలా ఉంది.తాను అధ్యక్షుడిగా మార్చి చివరి వరకు కాల పరిమితి ఉంది.అందుకే అప్పటి వరకు తాను అధ్యక్షుడిగా కొనసాగుతాను.కోర్టుకు వెళ్లినా కూడా నాకు న్యాయం జరుగుతుందని ఆయన అంటున్నాడు.పదవిపై మోజు కాదు కాని, తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలనే ఉద్దేశ్యంతో తాను ఈ నెల చివరి వరకు కూడా అధ్యక్షుడిగా కొనసాగాలని భావిస్తున్నట్లుగా శివాజీ రాజా అంటున్నాడు, మరో వైపు నరేష్‌ మాత్రం ఈ చివరి నిమిషంలో అంతా గందరగోళం సృష్టించి అకౌంట్స్‌ ను తారు మారు చేసేందుకు శివాజీ రాజా ప్రయత్నించే అవకాశం ఉందని ఆరోపిస్తున్నాడు.

ఇద్దరి ఆరోపణలు మళ్లీ పీక్స్‌కు చేరాయి.ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇద్దరు కూడా మళ్లీ కలిసి పోతారని అంతా భావించారు.కాని ఎన్నికలు పూర్తి అయినా కూడా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

అత్యంత వివాదాస్పదంగా మారిన మా ఎన్నికలు, అధ్యక్ష అభ్యర్థుల విషయం ఇంకా హాట్‌ హాట్‌గా చర్చ జరుగుతూనే ఉంది.ఈ విషయంలో ఎవరైనా చొరవ తీసుకుంటే తప్ప వివాదం సర్దుమనిగేలా లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube