600 మందికి న్యాయం చేయని వ్యక్తి లక్షల మందికి న్యాయం చేస్తాడా?  

Sivaji Raja Political Comments On Nagababu-jeevitha Rajasekhar,sivaji Raja,telugu Maa

మా ఎన్నికల్లో తన ఓటమికి కారణం అయిన నాగబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవఆస్తానంటూ శివాజీ రాజా బాహాటంగానే ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో జనసేన తరపున నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా బరిలో ఉన్న నాగబాబుపై మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తన సొంత ప్రాంతం అయిన భీమవరం కనుక తాను ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను..

600 మందికి న్యాయం చేయని వ్యక్తి లక్షల మందికి న్యాయం చేస్తాడా?-Sivaji Raja Political Comments On Nagababu

నాకు ఎవరిపై కోపం లేదు కాని మంచి నాయకుడు అయితేనే ప్రజలకు న్యాయం చేస్తాడనే ఉద్దేశ్యంతో తాను వైకాపాకు మద్దతు ఇస్తున్నట్లుగా ఆయన ప్రకటించాడు.

నాగబాబు 600 సభ్యులు ఉన్న మా ను సరిగా చూసుకోలేక పోయాడు. మా లో ఎంతో మంది సభ్యులు తీవ్రంగా అల్లాడుతున్న సమయంలో ఆయన కనీసం సాయం చేయలేదు. అలాంటి నాగబాబు లక్షల మంది ఉన్న పార్లమెంటు నియోజక వర్గంకు ఎంపీ అయితే ఏం లాభం ఉండదు అన్నాడు.

అసలు నరసాపురం హద్దులు ఆయనకు తెలుసా, ఎక్కడ నుండి ఎక్కడ వరకు నరసాపురం ఉంటుందో ఆయనకు తెలియదు. అలాంటి ఆయన ఎంపీ అయితే నరసాపురం మురికి కాలువు అవ్వాల్సిందే అంటూ శివాజీ రాజా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశాడు..

రాత్రికి రాత్రే తన కుటుంబ సభ్యులను గతంలో తీవ్రంగా వ్యతిరేకించి, దూషించిన వారితో కుమ్మక్కు అయ్యి నాకు వ్యతిరేకంగా మారాడు. వారికి బాహాటంగా మద్దతు తెలపవడంతో నేను ఆ రోజు రాత్రి అంతా కూడా ఏడ్చాను.

నేను పడ్డ క్షోభ అంతా ఇంతా కాదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న నేను మా కోసం కష్టపడ్డాను. కాని నాగబాబు మాత్రం కనీసం పది మందికి అయినా సాయం చేసిన వ్యక్తి కాదు..

అలాంటి వ్యక్తికి ఓటు వేయడం వల్ల ఒరిగేది ఏమీ లేదు అంటూ శివాజీ రాజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.