చిరంజీవి పిలిచి చెయ్యమన్నా సినిమా చెయ్యను.. నటుడి కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన శివాజీ రాజా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడంతో పాటు సీరియళ్ల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్నారు.ఒక ఇంటర్వ్యూలో శివాజీరాజా మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సినిమా ఆఫర్లకు సంబంధం లేదని వెల్లడించారు.

 Sivaji Raja Comments About Movie Offers Goes Viral In Social Media , Chirenjeevi, Movie Offers, Shivaji Raja , Moguds Pellams, Tollywood-TeluguStop.com

హీరోగా తాను 10 సినిమాలు చేసి ఉంటానని శివాజీరాజా తెలిపారు.మొగుడ్స్ పెళ్లామ్స్ సినిమా తప్ప తాను హీరోగా నటించిన సినిమాలు ఆడలేదని ఆయన అన్నారు.

రంగనాథ్ గారు నాతో సినిమా చేయాలని అనుకుని మొగుడ్స్ పెళ్లామ్స్ చేశారని ఆయన తెలిపారు.ఎస్వీ కృష్ణారెడ్డి, రాఘవేంద్ర రావు, కృష్ణవంశీ, రవిరాజా పినిశెట్టి, నాగబాబు, ముత్యాల సుబ్బయ్య, కోడి రామకృష్ణ, వంశీ, కోదండ రామిరెడ్డి తనకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చారని శివాజీరాజా వెల్లడించారు.

 Sivaji Raja Comments About Movie Offers Goes Viral In Social Media , Chirenjeevi, Movie Offers, Shivaji Raja , Moguds Pellams, Tollywood-చిరంజీవి పిలిచి చెయ్యమన్నా సినిమా చెయ్యను.. నటుడి కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాజేంద్ర ప్రసాద్ కూడా నన్ను సపోర్ట్ చేశారని ఆయన తెలిపారు.నన్ను హీరోగా చూసింది పెద్ద వంశీ గారు అని ఆయన తెలిపారు.

నేను ఎక్కడికీ వెళ్లినా చిరంజీవి పేరు చెబుతానని అలా చెప్పడం ప్లస్ అయిందో మైనస్ అయిందో చెప్పలేనని ఆయనను తాను ఎప్పుడూ వేషం అడగలేదని శివాజీరాజా అన్నారు.చిరంజీవి ఇప్పుడు వేషం ఇచ్చినా చేయనని ఇప్పుడు నాకు ఓపిక లేదని శివాజీరాజా చెప్పుకొచ్చారు.

కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్లకు తమ ఫేవరెట్ హీరోపై ఉన్న అభిమానాన్ని బయటపెట్టవద్దని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Chiranjeevi, Moguds Pellams, Offers, Sivaji Raja, Tollywood-Movie

ఇది అనుభవంతో నేర్చుకున్న పాఠం అని శివాజీరాజా తెలిపారు.తాను ఇతరులతో మాట్లాడే సమయంలో కూడా చిరంజీవి గురించే చెబుతానని ఆ హీరో క్యాంప్ వాళ్లు మనవాడే అని పట్టించుకోరని అవతలి క్యాంప్ వాళ్లు నేను వేరే క్యాంప్ అని ఛాన్స్ ఇవ్వరని ఆయన తెలిపారు.మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయలేదనే బాధ నాకు లేదని శివాజీరాజా పేర్కొన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube