శివునికి చెల్లెలు ఉందని మీకు తెలుసా ?

Siva Sister Aswari Devi Details

త్రిమూర్తులలో ఒకరైన శివుడు సృష్టి, స్థితి, ల‌య కార‌కుల్లో చివరి వారు.లయ అంటే అన్నింటిని ఆయనలో కలుపుకుంటారు.

 Siva Sister Aswari Devi Details-TeluguStop.com

అందుకే ఆయనకు లయకారకుడు అని పిలుస్తారు.అలాగే ఆయనను బోళా శంకరుడు అని కూడా పిలుస్తారు.

ఎందుకంటే అయన భక్తులు కోరిన కోరికలను వెంటనే ఇచ్చేస్తారు.అందులో భాగంగానే పురాణాల్లో చాలా మంది తపస్సు చేసి వరాలను పొందారు.

 Siva Sister Aswari Devi Details-శివునికి చెల్లెలు ఉందని మీకు తెలుసా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక విషయంలోకి వెళ్ళితే.శివునికి ఒక చెల్లి ఉంది.

అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు.

శివుని చెల్లెలి పేరు దేవీ అశావ‌రి.

ఆమె గురించి ఇప్పుడు తెలుసుకుందాం.శివుడు పార్వ‌తిని పెళ్లి చేసుకుని కైలాసానికి వ‌చ్చాక అక్క‌డ ఆమె కాపురం పెట్టింది.

అయితే అక్కడ ఆడవారు ఎవరు ఉండరు.అందరూ మగవారే ఉంటారు.

కైలాసంలో పార్వతికి ఎవరైనా మహిళ తోడుగా ఉంటే బాగుటుందని పార్వతి శివుణ్ణి అడగగా.శివుడు త‌న‌లాగే ఉండే దేవీ అశావ‌రిని సృష్టించాడు.

దేవీ అశావ‌రి శివుడిలాగే పులి చ‌ర్మం ధ‌రించి ఉంటుంది.జుట్టు విరబోసుకుని ఉంటుంది.

కాళ్లు ప‌గిలి ఉంటాయి.అయిన‌ప్పటికీ పార్వ‌తి సంతోషించి అశావ‌రిని ఇంటికి తీసుకెళ్తుంది.

అయితే నిజానికి అశావ‌రి వేషం ఏమీ బాగుండ‌దు.దాంతో పార్వతి అశావ‌రిని అందంగా తయారుచేస్తుంది.అంతేకాక అశావ‌రికి విపరీతమైన తిండి యావ.దీంతో పార్వ‌తి కైలాసంలో ఉన్న ఆహారం మొత్తాన్ని ఆమెకు పెడుతుంది.అయిన‌ప్ప‌టికీ అశావ‌రి తృప్తి చెంద‌దు.దీంతో పార్వ‌తి విసిగిపోయి త‌న గోడును శివుడికి చెప్పుకుంటుంది.దీంతో శివుడు అశావ‌రిని అక్క‌డి నుంచి వేరే ప్రాంతానికి పంపిస్తాడు.ఇదీ శివుని సోద‌రి క‌థ‌.

#Siva #Bola Shankara #SivaSister #Parvati #Devi Ashavari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube