కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమం.. ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపులు?

Siva Shankar Master Affected Coronavirus And He Critical Condition

ప్రముఖ కొరియోగ్రాఫర్ గా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ఎన్నో అవార్డులను ప్రశంసలను అందుకున్న కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన స్టార్ హీరోలందరి సినిమాలలోనూ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.

 Siva Shankar Master Affected Coronavirus And He Critical Condition-TeluguStop.com

అలాగే బుల్లితెరపై ఎన్నో డాన్స్ కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.జాతీయ అవార్డును అందుకున్న కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ తాజాగా కరోనా బారిన పడ్డారు.

ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన శివ శంకర్ మాస్టర్ చికిత్సకోసం ఆస్పత్రిలో చేరారు.ఈ క్రమంలోనే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

 Siva Shankar Master Affected Coronavirus And He Critical Condition-కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమం.. ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పూర్తిగా ఇతని ఊపిరితిత్తులు 75% ఇన్ఫెక్షన్ అయినట్లు వైద్యులు తెలియజేయడంతో ఇతని చికిత్స కోసం రోజుకు లక్షల్లో ఖర్చు అవుతుందని తెలిపారు.ఈ సందర్భంగా అతని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ రోజుకు లక్షల్లో ఖర్చు అవుతుండడం వల్ల అంత డబ్బు మా దగ్గర లేదని, ఎవరైనా తమకు ఆర్థిక సహాయం చేయాలని వెల్లడించారు.

Telugu Corona Virus, Health Condition, Magadheera M .raja Mouli, National Awards, Siva Sankar Master, Tollywood-Movie

ఇకపోతే శివ శంకర్ మాస్టర్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఎన్నో తమిళ సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేశారు.ఆయన కెరియర్లో 4సార్లు తమిళ స్టేట్ అవార్డులను పొందడమే కాకుండా తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాలోని ధీర.ధీర అనే పాటకు జాతీయ పురస్కారం అందుకున్నారు.ఈయన కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా సుమారు 30 చిత్రాలలో నటించి నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు.

#Corona Virus #MagadheeraRaja #National Awards

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube