సోనూసూద్ విషయంలో శివసేన తప్పులో కాలు ? వెంటనే ఇలా ?

సోను సూద్ విషయంలో శివసేన పప్పులో కాలు వేసిన శివ సేన అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకుని నష్ట నివారణ చర్యలకు దిగింది.కరోనా కారణంగా అకస్మాత్తుగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ వలస కూలీలు చిక్కుకుపోయారు.

 Siva Sena Mp Sanjay Rauth Comments On Sonu Soodh, Siva Sena, Sonu Soodh, Sanjay-TeluguStop.com

ఉన్నచోట ఉపాధిలేక, ఉండేందుకు నీడ లేక తమ సొంత ప్రాంతాలకు వెళ్లే క్రమంలో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆ సమయంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వలస కూలీల కష్టాలపై స్పందించారు.

నిత్యం సుమారు 45 వేల మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.ఇక ఆ తర్వాత వలస కూలీల కోసం ప్రత్యేకంగా బస్సులు, విమానాలు, ట్రైన్ లు ఇలా ఏర్పాటు చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు.

సినిమాల ద్వారా గత 20 ఏళ్లలో కూడబెట్టిన సొమ్ములు ఖర్చు పెడుతూ, వలస కూలీల కష్టాలను తీర్చుతూ వస్తున్నాడు.

అలాగే తాను విలాసవంతంగా నిర్మించుకున్న ఇంటిని సైతం కోవిడ్ ఆసుపత్రిగా వాడుకోవాలి అంటూ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.

ఈ విపత్కర సమయంలో సోనుసూద్ వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.కరోనా కష్టకాలంలో నిజమైన హీరో సోనుసూద్ అని అందరూ ప్రశంసించారు.

ఇదిలా ఉంటే సోను సూద్ పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.సోనూసూద్ తన సొంత పరపతి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, రాజకీయ కోణంలోనే ఆయన ఈ సహాయం చేస్తున్నారని, ఆయన నేటి మహాత్మా అవ్వాలనుకుంటున్నారా అంటూ రకరకాల కామెంట్స్ చేశారు.

Telugu Coronavirus, Matho Sri, Sanjay Rauth, Siva Sena, Sonu Soodh, Uddavu Thakr

ఈ మేరకు శివసేన అధికార పత్రిక సామ్నాలో కూడా శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలు ప్రచురితమయ్యాయి.అయితే ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా శివసేనపై ఆగ్రహం వ్యక్తం అవుతుండడం, పెద్ద ఎత్తున శివసేన తీరును తప్పు పడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ రావడం వంటి విషయాలు చోటు చేసుకోవడంతో, రానున్న ప్రమాదాన్ని గుర్తించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, మంత్రి ఆదిత్య థాకరే తో కలిసి సోను సూద్ తో సమావేశమయ్యారు.నిన్న అనగా ఆదివారం రాత్రి ముంబైలోని తన నివాసం మాతో శ్రీ లో సోను సూద్ తో సమావేశమై, వలస కూలీలు తరలించడంలో తీసుకున్న చొరవను ప్రశంసించారు.

Telugu Coronavirus, Matho Sri, Sanjay Rauth, Siva Sena, Sonu Soodh, Uddavu Thakr

అంతకుముందు శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయగా, ఆకస్మాత్తుగా ఉద్ధవ్ థాకరే ఈ విధంగా సోను సూద్ ను ప్రశంసించడం చూస్తుంటే, ఈ విషయంలో శివసేన భారీగానే విమర్శలు ఎదుర్కొంది అనే విషయం అర్థమైంది.తమ పార్టీకి మరింత డ్యామేజ్ జరగకుండా ఉద్దవ్ థాకరే ఈ విధంగా స్పందించి నష్ట నివారణ చర్యలు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube