మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి తొలగినట్లేనా?

మహారాష్ట్రలో ఎన్నికలు జరిగి దాదాపు నెల రోజులు కావస్తుంది.కాని ఇప్పటి వరకు అక్కడ కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు.

 Siva Sena Party Farm The Governament In Maharastra In Soon-TeluguStop.com

బీజేపీ అత్యధిక సీట్లను దక్కించుకున్నా కూడా మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకోవడంలో ఆ పార్టీ విఫలం అయ్యింది.మిత్రపక్షం శివసేన మద్దతు ఇస్తుందనుకుంటే ప్లేట్‌ ఫిరాయించి సీఎం పీఠం కావాలంటూ డిమాండ్‌ చేసింది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది.ఎన్నికల ముందు వరకు చెట్టా పట్టాలేసుకుని తిరిగిన బీజేపీ మరియు శివసేన పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు విషయానికి వచ్చేప్పటికి మొత్తం తారు మారు అయ్యింది.

రెండు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడం ప్రారంభం అయ్యింది.దాంతో బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదు అంటూ శివసేన నిర్ణయించుకుని మరో మార్గంను అన్వేషించింది.

ఎన్సీపీ మరియు కాంగ్రెస్‌ పార్టీలతో కలిసి ప్రభుత్వంను ఏర్పాటు చేయాలని శివ సేన నిర్ణయించుకుంది.మొదట ఆ రెండు పార్టీలు కూడా శివసేన పార్టీకి మద్దతు ఇచ్చేందుకు నో చెప్పాయి.

కాని శివసేన పార్టీ నాయకులు చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేయడంతో ఆ రెండు పార్టీలు కూడా ఓకే చెప్పాయి.నేడు చివరి గడువు అంటూ శివసేనకు గవర్నర్‌ సూచించడంతో చకచక చర్చలు జరిగాయి.

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో శివసేన చీప్‌ ఉద్దవ్‌ థాక్రే మాట్లాడాడు.కాంగ్రెస్‌ మద్దతు ఉంటుందని తెలియజేయడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది.

శివసేన పార్టీ నుండి సీఎం అయ్యే అవకాశాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube