మా ఎమ్మెల్యేలకు కోట్ల ఆశ చూపుతున్నారు  

Siva Sena Chief Comments On Bjp Party Leaders-maharastra Elections,siva Sena

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరియు శివసేన పార్టీలు మిత్రపక్షంగా పోటీ చేశాయి.కాని ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఒక పార్టీపై మరో పార్టీ సంచలన ఆరోపణలు చేసుకుంటూ రోజు రోజుకు రెండు పార్టీల మద్య దూరం పెంచుతున్నారు.

Siva Sena Chief Comments On Bjp Party Leaders-maharastra Elections,siva Sena-Siva Sena Chief Comments On BJP Party Leaders-Maharastra Elections

శివసేన పార్టీ నాయకులు ఇప్పటికే బీజేపీ తీరుపై విమర్శలు గుప్పిస్తూ ఉంటే బీజేపీ నాయకులు మాత్రం శివసేన పార్టీ ఎమ్మెల్యేలు 40 మంది తమకు టచ్‌లో ఉన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే శివసేన అధినేత మాట్లాడుతూ బీజేపీ నాయకులు తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడుతున్నారని, కోట్ల రూపాయలు ఆశ చూపిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.వందల కోట్ల రూపాయలను మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వారు రెడీ చేసుకుంటున్నారు అంటూ శివసేన సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే బీజేపీ నాయకులు మాత్రం ఈ వ్యాఖ్యలను కొట్టి పారేస్తున్నారు.శివసేన తీరు నచ్చకనే పలువురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మమ్ములను ఆశ్రయిస్తున్నారు అంటూ బీజేపీ నాయకులు అంటున్నారు.ఒకటి రెండు రోజుల్లో మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం నమోదు అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బీజేపీ మాత్రం ప్రభుత్వం ఏర్పాటుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది.